ఈ రోజుల్లో దొంగలు దేన్నీ వదిలి పెట్టడం లేదు.పొరపాటున ఏదైనా వస్తువు నిర్లక్ష్యంగా బయటపడితే చాలు వారి వెంటనే దాన్ని కొట్టేస్తున్నారు.
చివరికి చెప్పులు కూడా వీరు చోరీ చేస్తున్నారు.తాజాగా బెంగళూరులోని ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో( apartment complex in Bangalore ) తెల్లవారుజామున దొంగలు చొరబడ్డారు.
వారు విలువైన వస్తువులను దొంగిలించడానికి ఆసక్తి చూపలేదు, బదులుగా తలుపుల వెలుపల వదిలివేసిన అన్ని బూట్లు, చెప్పులు తీసుకున్నారు.వారు అపార్ట్‌మెంట్ మొత్తం కవర్ చేస్తూ ఒక్క షూ కూడా మిగల్చకుండా సంచిలో వేసుకున్నారు.
రెండు బస్తాల నిండా చెప్పులు నిండాక అక్కడి నుంచి పరారయ్యారు.

ఒక నెలలో ఇలా జరగడం ఇది మూడోసారి.దాంతో ప్రజలు ఇప్పుడు తమ బూట్లు బయట ఉంచడానికి భయపడుతున్నారు.చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు రకరకాల జోకులు వేస్తున్నారు.
ఈ దొంగలు చెప్పుల దుకాణం నడుపుతున్నారా ఏంటి? అని కొందరు సెటైర్లు పేల్చుతుంటే, మరికొందరు ఫుట్ వేర్‌యే కదా అని బయటే వదిలేస్తే అవి పోయే అవకాశం ఉందని అంటున్నారు.

వామ్మో, ఇలాంటి దొంగలు ఇక్కడే ఉంటే మా పరిస్థితి ఏంకాను అని మరి కొందరు ఆందోళన వ్యక్తం చేశారు.ఈ ఘటనపై పోలీసులు విచారణ( Police investigation ) జరుపుతున్నా ఇప్పటి వరకు దొంగలను గుర్తించలేకపోయారు.ఈలోగా, నివాసితులు తమ బూట్లు తమ ఇళ్ల లోపల లేదా సురక్షితమైన ప్రదేశంలో ఉంచుకోవాలని సూచించారు.
@nammabengaluroo ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసిన ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.







