భారీ ధరకు 'గుంటూరు కారం' ఆడియో రైట్స్.. ఎవరు దక్కించుకున్నారంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) లేటెస్ట్ గా నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ ”గుంటూరు కారం( Guntur Kaaram )”.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి.

 Guntur Kaaram Movie Latest Update, Guntur Kaaram, Mahesh Babu, Trivikram, Pooja-TeluguStop.com

సినిమా అనుకున్న సమయానికి పూర్తి అవుతుందా లేదా అని అనుమానాలు వచ్చాయి.కానీ వాటికీ మేకర్స్ చెక్ పెట్టారు.

షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అయ్యి శరవేగంగా పూర్తి అవుతుంది.ఇక ఈ సినిమా రిలీజ్ కు ఇంత సమయం ఉన్న అప్పుడే బిజినెస్ భారీగా చేస్తున్నట్టు టాక్.ఎప్పటి నుండో ఈ సినిమా భారీ బిజినెస్ జరుగుతుందని వార్తలు వస్తూనే ఉన్నాయి.ఇక అప్పుడప్పుడు కొన్ని వార్తలు బయటకు వస్తూ ఈ సినిమాపై అంచనాలు మరిన్ని పెంచేస్తున్నాయి.

ఇది పాన్ ఇండియా కాకపోయినా ఈ సినిమా కోసం కూడా ఏకంగా 220 కోట్ల బడ్జెట్ పెట్టనున్నారట.అయితే ఈ బడ్జెట్ కు అనుగుణంగానే ప్రీ బిజినెస్ కూడా భారీగా జరుగుతుంది.మహేష్, త్రివిక్రమ్ వల్ల ఈ సినిమాకు అదే రేంజ్ లో క్రేజ్ రాగ బిజినెస్ స్థాయి కూడా పెరిగింది.తాజాగా ఈ సినిమా ఆడియో రైట్స్ భారీ ధరకు ప్రముఖ మ్యూజికల్ సంస్థ ఆదిత్య మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది.

త్వరలోనే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ చేయనున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి( SreeLeela ) హీరోయిన్ లుగా నటిస్తుండగా జగపతి బాబు విలన్ గా కనిపిస్తున్నాడు.

ఇక హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube