సాధారణంగా చిన్నారులు మాట్లాడే మాటలు భలే ముచ్చట గొలుపుతుంటాయి.ముఖ్యంగా వీరు స్కూల్‌లో చెప్పే సాకులు, చాడీలు నవ్వు పుట్టిస్తుంటాయి.
ఈ తరహా వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ అయ్యాయి.కాగా ఈ కోవకు చెందిన మరో వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో ఒక చిన్నారి తన తల్లిపై టీచర్‌కి ఫిర్యాదు చేస్తూ కనిపించింది.క్యూట్ గా ఉన్న ఈ బాలిక బాగా ఏడ్చేస్తూ ముద్దు ముద్దుగా మాట్లాడుతూ తన తల్లిపై కంప్లైంట్ ఇచ్చింది.
ఈ వీడియో చూసిన వారు ఆ బాలిక అమాయకత్వానికి, ముద్దు ముద్దు మాటలకు బాగా ఫిదా అవుతున్నారు.
ఈ వైరల్ వీడియోలో కొంతమంది పిల్లలు ఒక తరగతి గదిలో కూర్చొని ఉండటం మీరు గమనించవచ్చు.
కాగా ఈ పిల్లలలో ఒక చిన్నారి నిల్చొని ఏడవటం మొదలు పెట్టింది.అయితే ఉన్నట్లుంది ఎవరూ ఏమీ అనకపోయినా ఆ బాలిక ఏడవటం చూసి టీచర్ ఆందోళన పడింది.“హేయ్, ఎందుకు ఏడుస్తున్నావు, ఏడవడం ఆపేసి అసలు ఏమైందో చెప్పు” అని టీచర్ అడిగింది.ఆ తర్వాత టీచర్ అడిగిన ప్రశ్నకు ఆ చిన్నారి ఊహించని ఆన్సర్ ఇచ్చింది.
తన అమ్మ తనని కొడుతుందని ఆమె కొట్టకుండా ఆపాలంటూ ఆ చిన్నారి టీచర్ ని అడిగింది.
టీచర్ పాపను ‘మీ అమ్మ ఏం చేస్తోంది” అని ప్రశ్నించడం మీరు వినవచ్చు.
దానికి ఆ బాలిక.కొడుతుంది అని ప్రభుత్వ ఇంకా ఎక్కువగా ఏడ్చేసింది.
ఎవర్ని అని అడగగానే చాలా అసహనంగా ఇంకెవరిని నన్నే అంటూ ఆ పిల్ల చెప్పింది.వెంటపడి మరి నన్నే కొడుతోంది అని ఆ బాలిక అమాయకంగా చెప్పడంతో టీచర్ కూడా కాస్త నవ్వేసింది.
ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేయగా దీనికి ఇప్పటికే వేలల్లో వ్యూస్ లైక్స్ వచ్చాయి.దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.