భారత రైల్వే శాఖ సామాన్య ప్రజలకు లక్కీ డ్రాలో రూ.6,000 అందిస్తోందా.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెసేజ్‌లు నిజమేనా అని అడిగితే కాదనే చెప్పాలి.ప్రజల అత్యాశను సొమ్ము చేసుకునే సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలని ఎంచుకుంటున్నారు.
ఇప్పుడు ఈ కేటుగాళ్లు ఏకంగా ఇండియన్ రైల్వే పేరు ఉపయోగించి ప్రజల నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు.
వివరాలు తెలుసుకుంటే.
ఇండియన్ రైల్వే లక్కీ లాటరీ నిర్వహిస్తున్నట్లు.గెలిచిన వారికి రూ.6,000 అందిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.అయితే ఈ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయడానికి పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సిందిగా ఈ ప్రచార ప్రకటనలు కోరుతున్నాయి.
చాలామంది ఇది నిజమేనని భావించి తమ వ్యక్తిగత వివరాలను అందిస్తున్నారు.ఈ నేపథ్యంలో తాజాగా ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఒక క్లారిఫికేషన్ అందించింది.

“ఇండియన్ రైల్వే మంత్రిత్వ శాఖ పేరుతో ఒక ఫేక్ మెసేజ్ అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇది వ్యక్తుల వ్యక్తిగత వివరాలను కోరిన తర్వాత రూ.6,000 గెలుచుకునే అవకాశాన్ని అందిస్తోంది.ఇది స్కామ్ & భారతీయ రైల్వేలకు సంబంధించినది కాదు.దయచేసి ఈ ఫేక్ లాటరీ మెసేజ్ షేర్ చేయడం మానుకోండి.” అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ టీమ్ ట్విట్టర్ ద్వారా స్పష్టం చేసింది.ఒకవేళ ఇది నిజమైన నీ పొరపాటున డీటెయిల్స్ ఇస్తే బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది.







