తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 నుండి వరుసగా ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి.స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనుకున్న వారు వారి యొక్క ప్రవర్తన కారణంగా ఎలిమినేషన్ అవుతున్న విషయం తెలిసిందే.
అర్జే సూర్య చాలా గట్టి కంటెస్టెంట్ అనే అభిప్రాయం మొన్నటి వరకు అందరిలో ఉండేది, కానీ అతడి యొక్క పులిహోర వేషాల కారణంగా ఎలిమినేట్ అయ్యాడు.ఇప్పుడు గీతూ రాయల్ కూడా అదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆమె లో మంచి గేమ్ కనబడుతుంది.కానీ అందులో విలువలు మర్చి పోతుంది.
తాజా ఎపిసోడ్ లో బాలాదిత్య ను అత్యంత ధారణంగా ఏడిపించిన గీతూ వ్యవహారం పై ప్రేక్షకులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.బాలాదిత్య సిగరెట్స్ తాగకుండా ఉండలేడు.
అతడి మైండ్ సిగరెట్ లేకుంటే పనిచేయదు అని అందరికీ తెలుసు.

అతడు సమయానికి సిగరెట్ తాగకుండా మానసికంగా చాలా క్షీణించిపోయినట్లుగా ప్రవర్తిస్తాడు, అది అతని బలహీనత.దాన్ని తప్పు పట్టడానికి లేదు.అయితే ఆ బలహీనతను వాడుకొని గేమ్ లో గెలవాలని గీతూ ప్రయత్నించడం ఏమాత్రం కరెక్ట్ కాదంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అతడి యొక్క బలహీనత ఆయన సిగరెట్లు దాచిపెట్టి గేమ్ లో గెలవాలనుకున్న గీతు ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.బాలాదిత్య కూడా కన్నీళ్లు పెట్టుకొని మరి సిగరెట్ కోసం ప్రాధేయపడిన కూడా ఏ ఒక్కరూ అతనికి సిగరెట్ లైటర్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు.
అతడు కన్నీళ్లు పెట్టుకోవడం ప్రేక్షకులను కదిలించింది.అతడు సిగరెట్ కోసం కన్నీళ్లు పెట్టుకున్నా కూడా గీతూ సిగర్స్ ఇవ్వలేదు.దాంతో ఆమె పై చాలా మందికి కోపం వస్తుంది.ఆ సంఘటన కోపం తెప్పించే విధంగా ఉంది.
దాంతో బాలాదిత్య ని టార్గెట్ చేసినందుకు గాను గీతూకు పెద్ద డ్యామేజ్ అవ్వబోతుంది అంటూ రివ్యూవర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయమై గీతు ఈరోజు ఎపిసోడ్ లో ఎలా స్పందిస్తుందో చూడాలి.







