వీడియో: వాక్యూమ్ క్లీనర్‌తో పిల్లి ఆటలు.. చివరి ట్విస్ట్ చూస్తే షాకే!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని పిల్లి వీడియోలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి.అయితే కొన్ని మాత్రం మనలో ఆగ్రహాన్ని తెప్పిస్తాయి.

 Video Cat Plays With Vacuum Cleaner Shocking To See The Last Twist , Vaccum Clea-TeluguStop.com

తాజాగా అలాంటి వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.దీన్ని చూసిన నెటిజన్లు పిల్లి యజమానిని తిట్టిపోస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక సోఫాలో ఒక తెల్ల పిల్లి కూర్చొని ఉండటం చూడవచ్చు.దీని ముందు ఒక వాక్యూమ్ క్లీనర్ పైపు ఉంది.ఈ పైపు దాని ముందున్న గాలిని వేగంగా పీల్చుతోంది.ఆ పైపు చేస్తున్న సౌండ్ తో పాటు పైపు గాలి పీల్చడం చూసి పిల్లి ఆశ్చర్యపోయింది.

ఆ తర్వాత తన ముక్కుని ఆ పైపు వద్ద ఉంచింది.ఆపై తన తన రెండు ముందర కాళ్లతో ఆ పైపును టచ్ చేస్తూ ఆడుకుంది.

ఆ తర్వాత తన మూతిని పైపు రంధ్రానికి దగ్గరగా పెట్టింది.అంతే ఆ పైపు ఆ పిల్లి నోటిని తన లోపలికి లాగటం మొదలు పెట్టింది.

దీంతో ఆ పిల్లి మూతి ఆ పైపు లోపలికి పోయింది.ఈ దృశ్యాలను కెమెరాలో రికార్డ్ చేస్తున్న యజమాని వెంటనే అప్రమత్తమయ్యారు.

అనంతరం పైపును వెంటనే లాగేసారు.దాంతో పిల్లి ప్రాణాలతో బతికి పోయింది.

ఈ వీడియోని ఆగస్టు 8న అంతర్జాతీయ పిల్లుల దినోత్సవం సందర్భంగా వైరల్ హాగ్ అనే ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు నవ్వుకుంటూ ఉంటే మరికొందరు మాత్రం ఇది నవ్వే విషయం కాదని అంటున్నారు.చివరిలో ఆ పిల్లి నోరు పైపులో ఇరుక్కుపోవడం వల్ల అది బాగా ఇబ్బంది పడింది.దీని వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉందని కామెంట్లు చేస్తున్నారు.

తరచూ ఇలా చేస్తే పిల్లి ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యే అవకాశం లేకపోలేదని మరికొందరు కామెంట్ పెట్టారు.మూగ జంతువుల ప్రాణాలతో ఇలా ఆడుకోకండి అని ఇంకొందరు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ వీడియోకి పదివేలకు పైగా లైకులు, లక్షల వ్యూస్ వచ్చాయి.దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube