బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ హీరోగా కరీనా కపూర్ ఖాన్ హీరోయిన్ గా నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది.ఈ వారంలో దేశ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా పై అంచనాలు భారీ గా ఉన్నాయి.
ఎప్పుడు లేనిది ఈ సినిమా ను తెలుగు లో పెద్ద ఎత్తున ప్రమోట్ చేశారు.ఈ సినిమా కు సమర్పకుడిగా మెగా స్టార్ చిరంజీవి వ్యవహరిస్తున్నాడు.
చిరంజీవి ఎప్పుడు కూడా ఒక హిందీ సినిమాకు అది కూడా డబ్బింగ్ వర్షన్ కు సమర్పకుడిగా వ్యవహరించింది లేదు.ఈసారి కేవలం ఆమీర్ ఖాన్ తో ఉన్న స్నేహం కోసం మరియు సినిమా కంటెంట్ నచ్చడం తో సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాను అంటూ చెప్పుకొచ్చాడు.
గతంలో ఆమీర్ ఖాన్ నటించిన ఏ ఒక్క సినిమా కూడా తెలుగు లో డబ్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నది లేదు.
అక్కడ వందల కోట్లు వసూళ్లు సాధించిన సినిమా లు కూడా ఇక్కడ పెద్దగా సందడి చేసిన దాఖలాలు లేవు.
కాని ఈసారి మాత్రం మెగా స్టార్ దయ వల్ల హిందీ లో కంటే తెలుగు లో ఎక్కువగా సినిమా కి ప్రమోషన్ దక్కింది.ఇక్కడే మంచి ఓపెనింగ్స్ వస్తాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
లాల్ సింగ్ చడ్డా కోసం అంతటి హెల్ప్ చేసిన మెగాస్టార్ చిరంజీవి పారితోషికం కాని.లాభాల్లో వాటా కానీ తీసుకోకుండా ఈ సినిమా కు సమర్పకుడిగా వ్యవహరించాడా అంటూ కొందరు చర్చించుకుంటున్నారు.
నిజంగానే సినిమా కంటెంట్ నచ్చి.సినిమా లో నటించిన ఆమీర్ ఖాన్ కోసం చిరంజీవి ఈ సినిమా ను సమర్పించినట్లయితే చిరంజీవి ఒక గొప్ప వ్యక్తి అనడంలో సందేహం లేదు.
చిరంజీవికి ఈ సినిమా వల్ల వచ్చింది ఏంటీ.పొందినది ఏంటీ అనే విషయాలపై త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.