కాటన్ ఫ్యాక్టరీలో( Cotton factory ) చిన్న నిప్పురవ్వ పుట్టిన సరే అది అతి పెద్ద అగ్ని ప్రమాదానికి దారి తీస్తుంది.పత్తి మంటను వెంటనే అంటుకునే స్వభావం గల పదార్థం.
కొంచెం పత్తికి మంట అంటుకుంటే చాలు అది పక్కన ఉన్న మొత్తం పత్తికి మిల్లి సెకన్లలో పాకుతుంది.అందుకే ఇలాంటి ఫ్యాక్టరీలలో నిప్పును సమర్థవంతమైన వ్యవస్థలను కూడా ఏర్పాటు చేసుకోవడం ఎంతో ముఖ్యం.
ఉద్యోగులకు కూడా నిప్పును ఎప్పుడూ ఫ్యాక్టరీ లోపల వెలిగించకూడదని చెప్పాలి.కానీ ఇవన్నీ విషయాలలో ఒక ఫ్యాక్టరీ ఓనర్ విఫలమయ్యాడు.
దాంతో పెద్ద ప్రమాదమే చోటుచేసుకుంది.ఒక వ్యక్తి పత్తి ఫ్యాక్టరీలో పని చేస్తూ లైటర్ ఉపయోగించాడు.
ఆ లైటర్ ( Lighter )నుంచి ఒక నిప్పురవ్వ వచ్చి పత్తిపై పడింది.అంతే ఒక్కసారిగా అంటుకున్న మంట ఎంత ఆర్పడానికి ప్రయత్నించినా ఆరలేదు.ఫ్యాక్టరీ సిబ్బంది ఫైర్ ఆర్పడానికి ప్రయత్నించారు కానీ ఆ మంట చూస్తుండగానే శరవేగంగా ఫ్యాక్టరీలోని మొత్తం పత్తికి పాకింది.దీనికి సంబంధించిన వీడియోని సీసీటీవీ ఇడియట్స్ అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.
ఇది ఓపెన్ చేస్తే ఒక వ్యక్తి మంటలు అంటుకున్న పత్తిని కొడుతూ ఉండడం కనిపించింది.మిగతా సిబ్బంది కూడా ట్రై చేశారు కానీ పత్తి క్షణాల్లోనే ఎర్రగా మారి పొగలు కక్కుతూ మండటం మొదలుపెట్టింది.
దీన్ని చూసి ఓ మహిళా సిబ్బంది కాలును నేలపై గట్టిగా తన్ని ఛ! అంటూ నిరాశను వ్యక్తం చేయడం కూడా మనం చూడవచ్చు.
ఈ వీడియో( viral video ) చూసి చాలామంది షాక్ అవుతున్నారు మరి ఇంత మూర్ఖత్వం ఉన్నవారిని ఎలా పనిలో చేర్చుకుంటారు అని ఒక వ్యక్తి ప్రశ్నించారు.దీనివల్ల ఆ ఫ్యాక్టరీ ఓనర్ ఎంత నష్టపోయి ఉండాల్సి ఉంటుందో అని ఇంకొకరు కామెంట్ చేశారు.నిన్ననే షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే 20 లక్షలు దాకా వ్యూస్ వచ్చాయి.