ఆడవాళ్లు మీకు జోహార్లు రిజల్ట్.. వెంకటేష్ హ్యాపీ..!

శర్వానంద్, రష్మిక మందన్న జంటగా కిశోర్ తిరుమల డైరక్షన్ లో వచ్చిన సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు.

ఈ శుక్రవారం రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన అందుకుంది.

ఓ వర్గం ప్రేక్షకులు అయితే ఇది సినిమా కాదు సీరియల్ అనేస్తున్నారు. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా శర్వానంద్ కన్నా ముందు విక్టరీ వెంకటేష్ దగ్గరకు వెళ్లింది.

కిశోర్ తిరుమల వెంకటేష్ కాంబోలో ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ కూడా వచ్చింది.అయితే ఎందుకో ఏమో కానీ ఎనౌన్స్ మెంట్ తర్వాత వెంకటేష్ ఈ సినిమా నుండి తప్పుకున్నారు.

వెంకీ కాదన్న ఈ ప్రాజెక్ట్ కి శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.సినిమా కథ బాగున్నా మరీ సీరియల్ లా ఎమోషల డ్రామా నడిపించాడని డైరక్టర్ మీద ఆడియెన్స్ కామెంట్ చేస్తున్నారు.

Advertisement

ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా మిస్ చేసి వెంకటేష్ మంచి పనిచేశాడని విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ అంటున్నారు.ప్రస్తుతం వెంకటేష్ ఎఫ్3 సినిమా చేస్తున్నారు.

ఆ సినిమా తర్వాత రానాతో కలిసి నెట్ ఫ్లిక్స్ వెబ్ సీరీస్ లో కూడా నటిస్తున్నారు. ఈ వెబ్ సీరీస్ కి సంబందించిన అప్డేట్స్ త్వరలో బయటకు రానున్నాయి.

Advertisement

తాజా వార్తలు