విక్టరీ వెంకటేష్ కూతురికి అరుదైన గుర్తింపు.. ఏం జరిగిందంటే..?

స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ సక్సెస్ రేట్ ఉన్న అతికొద్ది మంది టాలీవుడ్ హీరోలలో ఒకరనే సంగతి తెలిసిందే.ఈ ఏడాది వెంకటేష్ నటించిన నారప్ప, ఎఫ్3, దృశ్యం2 సినిమాలు రిలీజ్ కావాల్సి ఉండగా ఏ సినిమా మొదట రిలీజవుతుందో ఏ సినిమా ఆలస్యంగా రిలీజవుతుందో తెలియాల్సి ఉంది.

దృశ్యం2, నారప్ప సినిమాలను సురేష్ బాబు ఓటీటీలకు అమ్మేశారని వార్తలు వస్తున్నా ఆ వార్తలు నిజమో కాదో తెలియడం లేదు.అయితే తాజాగా విక్టరీ వెంకటేష్ కూతురు అరుదైన గుర్తింపును సొంతం చేసుకుని వార్తల్లో నిలిచారు.

ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కువ సంఖ్యలో ఫాలోవర్లను కలిగి ఉండి ఎక్కువ డబ్బులను సంపాదిస్తున్న వారి జాబితాలో వెంకటేష్ కూతురు అశ్రితకు చోటు దక్కింది.అశ్రిత ఫుడ్ బిజినెస్ లో వ్యాపారవేత్తగా రాణిస్తుండగా ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లో 1,36,359 మంది ఫాలోవర్లు ఉన్నారు.

అశ్రిత చేసే ప్రతి పోస్ట్ కు 400 డాలర్లు అనగా మన కరెన్సీలో 31,000 రూపాయలు చెల్లిస్తారని సమాచారం.హాపర్ సంస్థ ఈ జాబితాను రూపొందించడం గమనార్హం.

Advertisement

ప్రపంచవ్యాప్తంగా అశ్రిత 377వ స్థానాన్ని దక్కించుకోవడం గమనార్హం.ఆసియాలో అశ్రిత 27వ స్థానంలో నిలిచారు.

తెలుగమ్మాయి అశ్రిత ఈ అరుదైన ఘనతను సాధించడంతో ఆమె అభిమానులు సంతోషిస్తున్నారు.ప్రస్తుతం అశ్రిత బార్సిలోనాలో ఉంటున్నారని సమాచారం.

అశ్రిత చేస్తున్న వంటకాలు, బేకరీ ఐటమ్స్ కు ఇన్ స్టాగ్రామ్ లో మంచి స్పందన వస్తోంది.

ఇన్ ఫినిటీ వాటర్ పేరుతో అశ్రిత బిజినెస్ ను చేస్తుండటం గమనార్హం.ఈ బ్రాండ్ తో నాణ్యతతో కూడిన మెరుగైన ఆహారాన్ని అశ్రిత అందిస్తున్నారు.తన ప్రతిభతో అశ్రిత తండ్రికి తగిన కూతురిగా ఇండస్ట్రీలో రాణిస్తుండటం గమనార్హం.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

సినిమా ఇండస్ట్రీకి మాత్రం అశ్రిత దూరంగా ఉండటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు