టాలీవుడ్ లో మల్టీస్టారర్ అంటే ముందు గుర్తొచ్చే హీరో పేరు విక్టరీ వెంకటేష్.సోలోగానే కాదు మల్టీస్టారర్ హీరోగా కూడా వెంకటేష్ సూపర్ క్రేజ్ తెచ్చుకుంటున్నారు.
మహేష్ తో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, నాగ చైతన్యతో వెంకీ మామ, వరుణ్ తేజ్ ఎఫ్2, ఎఫ్3 సినిమాలు చేశాడు వెంకటేష్.ఇక ఇప్పుడు మరో స్టార్ తో మల్టీస్టారర్ కు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.
విక్టరీ వెంకటేష్, మాస్ మహరాజ్ రవితేజ కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది.ఈ కాంబోని ఫిక్స్ చేస్తున్నారట డైరక్టర్ శ్రీకాంత్ అడ్డాల.
వెంకటేష్ తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నారప్ప సినిమాలకు కలిసి పనిచేసిన శ్రీకాంత్ అడ్డాల వెంకీకి మల్టీస్టారర్ కథ చెప్పాడట.
వెంకటేష్ కథ విని ఓకే అనగా రవితేజకి కథ వినిపించే ప్రయత్నాల్లో ఉన్నాడట శ్రీకాంత్ అడ్డాల.
మాస్ రాజా కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే మళ్లీ ఓ క్రేజీ కాంబో స్క్రీన్ మీద చూసే అవకాశం ఉంటుంది.వెంకటేష్, రవితేజ మల్టీస్టారర్ మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అందరి ఆడియెన్స్ కు సూపర్ ట్రీట్ ఇస్తుందని చెప్పొచ్చు.
ఈ సినిమాకు సంబందించిన మరిన్ని అప్డేట్స్ బయటకు రావాల్సి ఉంది.







