టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ తన ప్రేయసి జయా భరద్వాజ్‌ను మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే.చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లో అత్యంత కీలకమైన బౌలర్‌గా రాణించే దీపక్ ఈ నెల ప్రారంభంలో ఒక ఇంటి వాడయ్యాడు.
అయితే పెళ్లి వేడుకలలో భాగంగా అతడు తన ప్రియమైన భార్యతో డ్యాన్స్ చేసి అదరగొట్టాడు.తాజాగా ఈ డ్యాన్స్ వీడియోని తన ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతాలో షేర్ చేసుకున్నాడు.
అయితే ఎప్పుడూ మైదానంలో బౌలింగ్, బ్యాటింగ్ చేస్తూ ఉండే ఈ స్టార్ ప్లేయర్ ఇప్పుడు డ్యాన్సర్ గా కనిపించడంతో అభిమానులంతా అవాక్కవుతున్నారు.“దీపక్, నీలో ఈ టాలెంట్ కూడా ఉందా? ఇరగదీశావ్,” అని చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఈ వీడియోకి ఇప్పటికే 11 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.“డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఒక క్రికెట్ మ్యాచ్ ఆడిన దానికంటే ఎక్కువ ప్రెజర్ అనిపించింది.” అని వీడియోకి దీపక్ ఒక ఫన్నీ క్యాప్షన్ కూడా జోడించాడు.
ఆగ్రాలోని జేపీ ప్యాలెస్ హోటల్‌లో జరిగిన సంగీత్ సెరిమోనీలో ఈ నవ దంపతులు కాలు కదిపారు.
దీపక్ తన భార్యతో కలిసి ఒక హిందీ పాటకు నాట్యం చేశాడు.ఆ తర్వాత ఆమె సింగిల్ గా డ్యాన్స్ చేసి అదరగొట్టింది.

జయా చాలా గ్రేస్‌ఫుల్‌గా, క్యూట్ గా వేసిన స్టెప్స్ అందర్నీ కట్టిపడేశాయి అంటే అతిశయోక్తి కాదు.ఆమె అందం చూసి చాలా మంది వావ్, హీరోయిన్ కి ఏమాత్రం తీసుకోకుండా అదరగొట్టేసారు మేడం అని కామెంట్లు పెడుతున్నారు.మీ హస్బెండ్ కంటే మీ డ్యాన్స్ అదుర్స్ అని ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ రైట్ హ్యాండ్ స్వింగ్ బౌలర్ ప్రస్తుతం వెన్నుముఖ గాయం నుంచి రికవర్ అవుతున్నాడు.
అక్టోబరు 16 నుంచి ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు అతను దూరమయ్యే అవకాశం ఉంది.ఇక ఐపీఎల్ 2022లో సీఎస్‌కే టీమ్ రూ.14 కోట్లతో దీపక్ ని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.







