'నారప్ప' థియేటర్లలో విడుదల అయ్యి ఉంటే..!

వెంకటేష్‌.ప్రియమణి ప్రధాన పాత్రలో శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన నారప్ప సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమాను థియేటర్ల ద్వారా విడుదల చేయాలని మొన్నటి వరకు అనుకున్నారు.కాని ఇంకా థియేటర్లు ఎప్పటికి పూర్తి స్థాయిలో ఓపెన్‌ అవుతాయో చెప్పలేని పరిస్థితి ఉంది.

అందుకే నారప్ప సినిమా ను ఓటీటీ ద్వారా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చర్చ సోషల్‌ మీడియాలో తెగ జరుగుతోంది.

అమెజాన్ లో విడుదల అయిన నారప్ప సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది.వెంకటేష్‌ నటన అద్బుతం అంటూ చాలా మంది కామెంట్స్‌ చేస్తుండగా మరి కొందరు మాత్రం ఈ సినిమా వెంకటేష్ కెరీర్ లో నిలిచి పోయే సినిమా అంటూ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

వెంకటేష్‌ గతంలో ఎన్నో రీమేక్ లు చేశాడు.ఎన్నో సినిమాల్లో ఇమేజ్ పక్కన పెట్టి నటించాడు.

కాని ఇప్పటి వరకు ఇలాంటి నటన మాత్రం ఎప్పుడు కనబర్చలేదు అంటున్నారు.

నటన పరంగా అద్బుతం అంటున్నారు.కాని కమర్షియల్‌ ఎలిమెంట్స్ విషయంలో మాత్రం నిరాశ తప్పదు.తెలుగు లో సినిమా సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కావాల్సి ఉంటుంది.

కాని ఈ సినిమా లో కమర్సియల్‌ ఎలిమెంట్స్ లేవు.అవార్డు విన్నింగ్‌ సినిమా కాని కమర్షియల్‌ సినిమా కాదు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

కనుక ఈ సినిమా థియేటర్లలో విడుదల అయితే ఖచ్చితంగా నిరాశ పర్చేది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.సినిమాకు మహారాజ పోషకులు అయిన ఫ్యామిలీ ఆడియన్స్‌ నారప్ప ను చూసేందుకు థియేటర్లకు వచ్చే వారా అంటే డౌటే అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

నారప్ప ను ఓటీటీ లో విడుదల చేయడమే చాలా మంచి నిర్ణయం అన్నట్లుగా ట్రేడ్‌ వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు