వారసుడి సినీ ఎంట్రీ గురించి వెంకీమామ క్లారిటీ ఇదే.. అప్పుడే ఎంట్రీ ఇవ్వనున్నారా?

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) ప్రస్తుతం సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

సినిమా హిట్టు ప్లాప్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ (Back to back)సినిమాలలో నటిస్తే బిజీబిజీగా గడుపుతున్నారు విక్టరీ వెంకటేష్.

అందులో భాగంగానే ఇప్పుడు మరో కొత్త మూవీతో తీర్చుకునే ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.సంక్రాంతికి(Sankranti) వస్తున్నాం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వం వహించిన ఈ సినిమాలు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్(Meenakshi Chowdhury, Aishwarya Rajesh) లు హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 14న ఈ సినిమా విడుదల కానుంది.

ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వెంకి మామ అలాగే మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు.అందులో భాగంగానే అనిల్ రావిపూడి వెంకీ మామ ఇద్దరు బాలయ్య బాబు(Balayya Babu) హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నారు.

ఇప్పటికే ఈ ఎపిసోడ్లకు సంబంధించిన ప్రోమోలు విడుదలైన విషయం తెలిసిందే.బాలయ్య బాబు అనిల్ రావిపూడి అలాగే వెంకీ మామలతో డాన్సులు పాటలు వేస్తూనే మధ్య మధ్యలో కొన్ని ప్రశ్నలను అడిగి తెలుసుకున్నారు.

ఇందులో భాగంగానే వెంకటేష్(Venkatesh) వారసుడు అర్జున్(Arjun) సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు అన్న విషయాన్ని కూడా అడిగారు బాలయ్య బాబు.ఈ ప్రశ్నకు వెంకటేష్ స్పందిస్తూ.నా కొడుకు అర్జున్ వయసు ప్రస్తుతం 20 సంవత్సరాలు.

అర్జున్ యుఎస్ లో చదువుకుంటున్నాడు.అతనికి సినిమా అంటే ఫ్యాషన్ ఉంది.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
హీరోలు ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తారు.. కిచ్చా సుదీప్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

సరైన సమయానికి తన నిర్ణయాన్ని వెల్లడిస్తాడు.అతడు చాలా నెమ్మది అని చెప్పుకొచ్చారు వెంకటేష్.

Advertisement

ఈ సందర్భంగా వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.కొడుకు ఎంట్రీ ఇవ్వడం పక్కా కానీ కొంచెం సమయం పడుతుందని చెప్పకనే చెప్పేసారు వెంకీ మామ.

తాజా వార్తలు