వీరభద్రం చౌదరి - నరేష్ అగస్త్య కొత్త చిత్రం.. జులై నుండి షూటింగ్ ప్రారంభం

పూలరంగడు, చుట్టాలబ్బాయి లాంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వీరభద్రం చౌదరి దర్శకత్వంలో సేనాపతి చిత్రంతో ప్రశంసలు అందుకున్న నరేష్ అగస్త్య హీరోగా జయదుర్గాదేవి మల్టీమీడియా & డెక్కన్ డ్రీమ్ వర్క్స్ బ్యానర్స్ పై అనిల్ రెడ్డి సమర్పణలో సరికొత్త చిత్రం తెరకెక్కబోతుంది.క్రైమ్ కామెడీ జోనర్ లో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రాన్ని నబీషేక్, తూము నర్సింహా పటేల్ నిర్మిస్తున్నారు.

 Veerabhadram Chaudhary - Naresh Agastya New Movie Shooting Will Start From July-TeluguStop.com

జామి శ్రీనివాసరావు సహా నిర్మాత.జులై నుంచి షూటింగ్‌ ప్రారంభం కాబోతున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

దర్శకుడు వీరభద్రం చౌదరి- అనూప్ రూబెన్స్ లది సక్సెస్ ఫుల్ కాంబినేషన్.వీరి కాంబినేషన్ లో వచ్చిన పూలరంగడు బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో పాటు ఆల్బమ్ కూడా చార్ట్ బస్టర్ గా నిలిచింది.

ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ లో సినిమా రావడం ఆసక్తిని పెంచింది.ఈ చిత్రం కోసం వండర్ ఫుల్ క్రైమ్ కామెడీ స్క్రిప్ట్ ని సిద్ధం చేశారు వీరభద్రం చౌదరి.ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.‘దర్శకులు వీరభద్రం చౌదరి గారితో మా మొదటి సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది.వీరభద్రం చౌదరి గారు ఒక అద్భుతమైన కథ చెప్పారు.కథ వినగానే మరో ఆలోచన లేకుండా ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాలని నిర్ణయించాం.కథ చాలా వండర్ ఫుల్ గా వచ్చింది.జూలై నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నాం.

ఈ చిత్రానికి సంబంధించిన మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలని త్వరలోనే వెల్లడిస్తాం’ అన్నారు.

హీరో: నరేష్ అగస్త్యటెక్నికల్ టీమ్ : కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం:వీరభద్రం చౌదరి , సంగీతం: అనూప్ రూబెన్స్, బ్యానర్స్ : జయదుర్గాదేవి మల్టీమీడియా& డెక్కన్ డ్రీమ్ వర్క్స్, నిర్మాతలు: నబీషేక్, తూము నర్సింహా పటేల్, సమర్పణ : ఎం.సీ.అనిల్‌రెడ్డి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube