సినిమాలు వద్దని గూగుల్ లో పని చేస్తున్న తొలి ప్రేమ వాసుకి

ఒకసారి సినిమాల్లో నటించడం అలవాటయితే ఆ జీవితం నుంచి తప్పించుకోవడం చాలా కష్టం.సినిమానే జీవితంగా ఎంతో మంది బ్రతుకుతూ ఉంటారు.

 Vasuki Working In Google After Movies Details, Vasuki, Tholi Prema, Tholi Prema-TeluguStop.com

అక్కడే పుట్టి అక్కడే చనిపోయే నటీనటులు ఉన్నారు.సినిమా కోసం ప్రాణమైన ఇస్తారు కానీ సినిమాలు మానేయమంటే మాత్రం అస్సలు ఒప్పుకోరు.

చిన్నా చితక వేషాలు వేసే క్యారెక్టర్ నటీనటులు కూడా సినిమాల్లో నటించడానికి అనేక పాట్లు పడుతూ ఉంటారు.కానీ ఒకసారి స్టార్ డం చూసిన తర్వాత సినిమాలు మానేసి జాబ్ చేసుకోవాలంటే జరిగే పని కాదు.

అలాంటిది హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో మంచి సినిమాల్లో నటించి ప్రస్తుతం గూగుల్ లాంటి గొప్ప కంపెనీలో పని చేస్తున్న ఓ నటి గురించి తెలుసుకుందాం.

ఇంతకీ ఆ నటి ఎవరు అని అనుకుంటున్నారా ? ఆమె మరెవరో కాదండి తొలిప్రేమలో పవన్ కళ్యాణ్ కి చెల్లిగా నటించినా వాసుకి. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఇంటర్వ్యూస్ తో హల్చల్ చేస్తున్న వాసుకి నిజానికి మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నప్పటికీ అంతలా పవర్ఫుల్ పాత్రలు తన దగ్గరికి రాలేదు రావడం లేదు అని చెబుతోంది.తొలిప్రేమలో నటిస్తున్న సమయంలోనే ఆ సినిమాకి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో ప్రేమలో పడి ఆ తర్వాత పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఇద్దరు పిల్లలకి తల్లిగా మారింది.

Telugu Tholi Prema, Art Anand Sai, Pawan Kalyan, Pawankalyan, Vasuki, Vasuki Ana

అయితే పిల్లలు ఇద్దరు పెద్దయి పోయారు.కూతురు ఎంబిబిఎస్ చదువుతోంది కుమారుడు ఆర్కిటెక్చర్ చదువుతున్నారు.అందుకే తను ఇంట్లో ఖాళీగా ఉండడం ఇష్టం లేదు.అలా అని ఏ పాత్ర వస్తే ఆ పాత్ర చేయడానికి వాసుకి మనసు అంగీకరించడం లేదు.అందుకే తన సమయాన్ని ఏదైనా జాబ్ చేసి గడపాలని గూగుల్ కి అప్లై చేయగా అదృష్టం కొద్దీ ఆమెను గూగుల్లో జాబ్ వరించింది.అంతే హైదరాబాద్ కి మకాం మార్చి వాసుకి ప్రస్తుతం గూగుల్ లో జాబ్ చేస్తూ భర్త ఆనంద్ సాయికి చేతోడు వాదోడుగా ఉంటుంది.

ఇక ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సినిమాలే కాకుండా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి ఆర్కిటెక్చర్ పనులు చేయడంతో మంచి గుర్తింపు పొందారు.

ఇప్పుడు అయోధ్య రామ మందిరం పనుల్లో బిజీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube