మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Varun Tej ) ఒకరు.డిఫరెంట్ కథలతో కాన్సెప్ట్ లతో అలరించే వరుణ్ తాజాగా మరో ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
కథల ఎంపికలో తనదైన పంథాను కొనసాగిస్తున్న వరుణ్ ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియన్ మార్కెట్ పై ద్రుష్టి పెట్టారు.ప్రజెంట్ వరుణ్ తేజ్ క్రేజీ లైనప్ సెట్ చేసుకుంటున్నాడు.
ఆ లైనప్ లో ముందుగా రిలీజ్ అయిన మూవీ గాండీవధారి అర్జున( Gandeevadhari Arjuna )”.ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 25న అంటే ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యిన విషయం తెలిసిందే.
ముందు నుండి వరుస ప్రమోషన్స్ తో డీసెంట్ బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా ఈ రోజు రిలీజ్ కాగా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.
ఇదిలా ఉండగా వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’ ఓటిటి ప్లాట్ ఫామ్ లాక్ అయినట్టు తెలుస్తుంది.ఈ సినిమా హక్కులను ప్రముఖ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు కొనుగోలు చేసినట్టు టాక్.థియేటర్స్ రన్ ముగిసిన తర్వాత నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కు రాబోతుంది.
మరి సినిమా రిజల్ట్ ను బట్టి రెండు మూడు వారాల్లోనే ఓటిటి లోకి వచ్చే అవకాశం అయితే ఉంది.
ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు జోడీగా ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్య( Sakshi Vaidya ) హీరోయిన్ గా నటించగా.మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.అలాగే ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో నిర్మించగా.
మరి ఈ సినిమా ఎలాంటి ఓపెనింగ్స్ రాబడుతుందో మరి కొద్దీ గంటల్లో తెలియనుంది.