వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి పెళ్లి ఇప్పట్లో లేనట్టేనా..సంచలనం రేపుతున్న వరుణ్ తేజ్ లేటెస్ట్ కామెంట్స్!

సోషల్ మీడియా లో ఎంతో కాలం నుండి ట్రెండ్ అవుతున్న ప్రేమ జంట వరుణ్ తేజ్( Varun Tej ) మరియు లావణ్య త్రిపాఠి ( Lavanya Tripathi )రీసెంట్ గానే నిశ్చితార్థం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారని సోషల్ మీడియా లో ఎప్పుడో లీక్ అయ్యినప్పటికీ , వీళ్లిద్దరు బయటపడకపోవడం, మా మధ్య ఏమి లేదు అన్నట్టుగ ప్రవర్తించడం మనం ఎన్నో ఇంటర్వ్యూస్ లో చూసాము.

 Varun Tej - Lavanya Tripathi's Wedding Is Not Happening Now Varun Tej's Latest C-TeluguStop.com

కానీ చివరికి వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నాము అంటూ అధికారికంగా ప్రకటించి, నిశ్చితార్థం జరుపుకోవడం తో ఒక్కసారిగా అందరూ షాక్ కి గురి అయ్యారు.వీళ్లిద్దరి నిశ్చితార్థం కేవలం మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు మరియు లావణ్య త్రిపాఠి కుటుంబ సభ్యులతో పాటుగా వరుణ్ తేజ్ మనసుకు బాగా దగ్గరైన కొంతమంది సినీ పరిశ్రమకి చెందిన మిత్రులు మధ్యనే జరిగింది.

ఈ నిచితార్థం వేడుకకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

Telugu Gandivapath, Varun Tej, Varuntej-Movie

ఇది ఇలా ఉండగా వరుణ్ తేజ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘గాండీవ దారి అర్జున’( Gandiva Path Arjuna ) చిత్రం ఈ నెల 25 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతుంది.ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అన్నీ ప్రాంతాలలో ప్రారంభం అయ్యాయి.ఈ సినిమా ప్రొమోషన్స్ లో పాల్గొన్న వరుణ్ తేజ్ ని మీడియా రిపోర్టర్స్ లావణ్య తో పెళ్లి గురించి పలు ప్రశ్నలు అడిగి , ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలను బయటకి లాగే ప్రయత్నం చేసారు.

లావణ్య త్రిపాఠి తో మీ ప్రేమ వ్యవహారం ని చాలా సీక్రెట్ గా దాచిపెట్టారు కదా, ఎందుకు అని అడగగా, దానికి వరుణ్ తేజ్ సమాధానం ఇస్తూ నాకు నా ప్రైవేట్ లైఫ్ గురించి పబ్లిక్ ప్లాట్ ఫార్మ్స్ లో చెప్పుకోవడం ఇష్టం ఉండదు, అందుకే కాస్త ప్రైవసీ మైంటైన్ చేశాను అంటూ చెప్పుకొచ్చాడు.

Telugu Gandivapath, Varun Tej, Varuntej-Movie

మీ ఇద్దరి ప్రేమ ఎప్పటి నుండి మొదలైంది అని యాంకర్ అడిగిన ప్రశ్నకి వరుణ్ తేజ్ సమాధానం చెప్తూ మిస్టర్ సినిమా( Mr.Cinema ) నుండే మేమిద్దరం మంచి స్నేహితులం, అలా మా స్నేహం బయట కూడా కొనసాగి మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాము.ఇక ఆ తర్వాత అంతరిక్షం సినిమా ప్రారంభం అయ్యే ముందే ఇద్దరం జీవితాంతం కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం అంటూ చెప్పుకొచ్చాడు.

మరి పెళ్ళెప్పుడు అని అడగగా, ఇప్పుడే కాదండి, నేను డిసెంబర్ లో పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను నా సినిమాలు విడుదల అవ్వాల్సినవి ఉన్నాయి , కొన్ని షూటింగ్స్ జరుగుతున్నాయి, ఇవన్నీ అయ్యాక చేసుకోవాలి అని అనుకున్నాను, పెళ్లి హైదరాబాద్ లోనే చేసుకోవాలని ఉంది కానీ, ప్రైవసీ కోసం వేరే రాష్ట్రము లో కానీ ,వేరే దేశం లో కానీ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను, రెండు మూడు ప్రదేశాలను ఎంచుకున్నాను త్వరలోనే చెప్తాను అని చెప్పుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube