బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి వరుణ్ ధావన్ (Varun Dhawan) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా నటుడు వరుణ్ ఇంట సంబరాలు జరుగుతున్నాయి.
నటుడు వరుణ్ దావత్ తండ్రిగా ప్రమోట్ అయ్యారు.వరుణ్ ధావన్, నటాషా దలాల్ దంపతులకు పండంటి ఆడ బిడ్డ(Baby Girl) జన్మించింది.
సోమవారం నాడు మహాలక్ష్మీ ఇంటికి వచ్చింది.ఇక ఈ విషయాన్ని వరుణ్ ధావన్ తాజాగా సోషల్ మీడియాలో వేదికగా షేర్ చేశారు.

ఈ విధంగా వరుణ్ ధావన్ (varun dhawan) సోషల్ మీడియా వేదికగా తాను తండ్రి అయ్యాననే విషయాన్ని తెలియజేయడంతో ఇటు బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇకపోతే ఈయనకి కుమార్తె జన్మించారు అనే విషయం తెలియడంతో సోషల్ మీడియా వేదికగా సమంత(Samantha ) స్పందిస్తూ.ఇది అత్యంత శుభకరమైన వార్త.మీ ఇద్దరికీ కంగ్రాట్స్ అంటూ సమంత కామెంట్ పెట్టేసింది.

సమంత మాత్రమే కాకుండా బాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ కూడా ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇకపోతే వరుణ్ ధావన్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇక ఈయన సినిమాల విషయానికి వస్తే.వరుణ్ ధావన్ ఎక్కువగా సౌత్ సినిమాలను రీమేక్ చేస్తుంటాడు.ఇక్కడి మాస్ మసాలా సినిమాలను అక్కడ రీమేక్ చేస్తుంటాడు.ఇకపోతే ఇటీవల సమంతతో కలిసి ఈయన సిటాడేల్ వెబ్ సిరీస్(Citadel Web Series) లో కూడా నటించిన సంగతి తెలిసిందే.
ఈ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.







