సినిమా హిట్ అవ్వాలంటే ఆమె పాత్రని చంపేయాలి.. వివాదాస్పదమవుతున్న రానా, తేజ సజ్జా కామెంట్స్!

మామూలుగా హీరోలు దర్శకనిర్మాతలు సినిమాలు బాగా హిట్ అవ్వడం కోసం కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ని ఫాలో అవుతూ ఉంటారు.

కొందరు బయటికి చెప్పకపోయినా కూడా సెంటిమెంట్స్ ని ఫాలో అవుతూనే ఉంటారు.

రిలీజ్ డేట్లు, హీరోయిన్ల ఎంపిక విషయంలో చాలా సెంటిమెంట్స్ ఉంటాయి.రానా దగ్గుబాటి( Rana Daggubati ) ఒక దిక్కుమాలిన సెంటిమెంట్ ని బయటకి తీసి నటి వరలక్ష్మి శరత్ కుమార్ పై( Varalaxmi Sarath Kumar ) సెటైర్లు వేశారు.

ఇటీవల జరిగిన ఐఫా ఈవెంట్ లో రానా దగ్గుబాటి, తేజ సజ్జా హోస్ట్ లుగా సందడి చేశారు.రానా, తేజ సజ్జా( Teja Sajja ) వేసిన సెటైర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Varalaxmi Sarathkumar Sentiment Became Super Hit Formula For Samantha And Balakr

అందులో నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి రానా, తేజ సజ్జా చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.ఇదెక్కడి దిక్కుమాలిన సెంటిమెంట్ అంటూ కామెంట్స్ చేసున్నారు.ఈ సందర్బంగా తేజ సజ్జా మాట్లాడుతూ.

Advertisement
Varalaxmi Sarathkumar Sentiment Became Super Hit Formula For Samantha And Balakr

వరలక్ష్మి గారికి క్యారెక్టర్ ఇస్తే మాత్రం ఆవిడ ప్రాణం పెట్టి నటిస్తారు అని చెప్పగా వెంటనే రానా రియాక్ట్ అవుతూ.అవును లే ఈవిడ ప్రాణం పెడతారు.

డైరెక్టర్లు ఆవిడ ప్రాణం తీసేస్తారు అని అని సెటైర్ వేశారు.వెంటనే తేజ సజ్జా.

ఆమె ఏ చిత్రాల్లో చనిపోయారో చెబుతూ.హనుమాన్ లో( Hanuman ) చనిపోయింది, వీర సింహారెడ్డిలో( Veerasimha Reddy ) చనిపోయింది.

క్రాక్ లో చనిపోయారు.యశోదలో కూడా చనిపోయారు అంటూ తేజ సజ్జా నవ్వులు పూయించారు.

Varalaxmi Sarathkumar Sentiment Became Super Hit Formula For Samantha And Balakr
పురుషుల్లో హెయిర్ ఫాల్ ను స్టాప్ చేసే సూప‌ర్ టిప్స్‌!
పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?

వరలక్ష్మి రియాక్ట్ అవుతూ.గాయ్స్ నేను బతికిన చిత్రాలు కూడా చాలా ఉన్నాయి అంటూ బతిమాలుకుంది.సరేలే మిమ్మల్ని బతికిస్తే ఆ సినిమాలు చచ్చిపోయి అంటూ రానా ఫన్నీ కామెంట్స్ చేశారు.

Advertisement

దీనితో ఆడిటోరియం మొత్తం నవ్వుల్లో మునిగిపోయింది.సినిమా హిట్ అవ్వాలంటే వరలక్ష్మి పాత్రని చంపేయాలి.

ఇది కొత్త సెంటిమెంట్ అని అర్థం వచ్చేలా తేజ, రానా కామెంట్స్ చేయడం విశేషం.అయితే వరలక్ష్మీ నటించిన సినిమాను చూస్తే ఈ విషయం నిజమే నమ్మాల్సిందే.

స్టేజ్ పై తేజ చెప్పిన సినిమాలన్నీ కూడా మంచి సక్సెస్ గా నిలిచాయి.ఆ సినిమాలలో వరలక్ష్మి పాత్రను చంపేసే విధంగా డిజైన్ చేశారు డైరెక్టర్స్.

తాజా వార్తలు