తమిళ సీనియర్ స్టార్ హీరో శరత్ కుమార్ కూతురు అయిన వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.హీరోయిన్ గా కొన్నాళ్లు చేసిన వెంటనే వరలక్ష్మి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి పోయింది.
అందుకు కారణం ఆమె కాస్త బరువు పెరగడమే అనేది కొందరి విశ్లేషణ.చాలా కాలం గా తమిళం మరియు తెలుగు లో వరుసగా క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలను ఇంకా విలన్ పాత్రలను పోషిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ మళ్లీ హీరోయిన్ గా నటించాలంటూ అభిమానులు మరియు తెలుగు ప్రేక్షకులు ఇతర భాషల ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు.
అందుకు కారణం ఆమె ఈమధ్య చాలా సన్నబడింది.గతం లో కంటే చాలా సన్నగా కనిపిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ మళ్ళీ హీరోయిన్ గా నటిస్తే బాగుంటుంది అంటూ ఆమె సన్నిహితులు కూడా సూచిస్తున్నారట.
కెరీర్ ఆరంభం లో సన్నగా నాజూకుగా ఎలా అయితే కనిపించి మెప్పించిందో ఇప్పుడు అలాగే ఉందంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అందుకే ఆమె మళ్ళీ హీరోయిన్ గా నటిస్తే చూడాలని కోరుకుంటున్నాం అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆమెకు ఇంట్రెస్ట్ ఉన్నా ఫిలిం మేకర్స్ అవకాశం ఇస్తారా అనేది కొందరి అనుమానం.ఖచ్చితం గా ఆమె న్యూ లుక్ చూస్తే దర్శక నిర్మాతలు ఆమెను హీరోయిన్ పాత్రల కోసం సంప్రదించే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.
అతి త్వరలోనే వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్ గా ఏదో ఒక సినిమా కు సైన్ చేసే అవకాశం ఉంది.తెలుగులో బాలకృష్ణ తో కలిసి ఒక సినిమాలో సమంత తో కలిసి మరో సినిమాలో నటిస్తోంది.
ఆ రెండు సినిమాల్లో కూడా వరలక్ష్మి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే నటిస్తున్న విషయం తెలిసిందే.