'వకీల్ సాబ్‌' ఓటీటీ రిలీజ్ డేట్‌ కన్ఫర్మ్‌.. రేటు ఎంతో తెలుసా?

పవన్‌ కళ్యాణ్‌ రీ ఎంట్రీ మూవీ వకీల్‌ సాబ్‌ విడుదల విషయంలో కాస్త గందరగోళ పరిస్థితులు తలెత్తాయి.

సినిమా విడుదల అయిన వెంటనే కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో జనాలు థియేటర్లకు రావడం మానేశారు.

ఇక ఇటీవలే నైట్‌ కర్ఫ్యూను విధించారు.ఇదే సమయంలో సినిమా థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీని అమలు చేస్తున్నారు.

ఇన్ని సమస్యల మద్య వకీల్‌ సాబ్‌ సినిమా ఏం వసూళ్లు సాధిస్తుంది చెప్పండి.మొదటి నాలుగు అయిదు రోజుల పాటు ఒక మోస్తరుగా వసూళ్లు రాబట్టినా కూడా వంద కోట్లకు పైగా మించి సినిమా వసూళ్లు నమోదు చేసింది.

రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లు నమోదు చేస్తుంది అనుకుంటే కరోనా మొత్తం ప్లాన్‌ ను తలకిందులు చేసిందని వకీల్‌ సాబ్‌ యూనిట్‌ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.థియేటర్‌ ల్లో ఎలాగూ నడవని పరిస్థితి కనుక ఓటీటీలో అయినా విడుదల చేద్దాం అనే నిర్ణయానికి మేకర్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది.

Advertisement

కరోనా లేకుండా ఉండి థియేటర్లు బాగా నడిచి ఉంటే సినిమాను 50 రోజులు అయిన తర్వాత కాని ఓటీటీకి ఇచ్చే వారు కాదు.కాని ఇప్పుడు పరిస్థితి వేరేగా ఉంది కనుక మే 7 నుండి ఈ సినిమాను స్ట్రీమింగ్‌ చేసేందుకు అనుమతులు వచ్చాయి.

అమెజాన్‌ లో ఈ సినిమా ను భారీ ఎత్తున స్ట్రీమింగ్‌ చేసేందుకు సిద్దం అవుతోంది.పాతిక కోట్ల వరకు ఈ సినిమా కోసం అమెజాన్‌ వారు పెట్టి ఉంటారు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా ను అమెజాన్ ప్రైమ్‌ భారీ మొత్తంకు కొనుగోలు చేయాలని మొదటి నుండే భావిస్తుంది.

ఇప్పుడు ముందే విడుదలకు అనుమతులు రావడం వల్ల సినిమా ను భారీ మొత్తంకు అమ్మేందుకు సిద్దం అయ్యారు.వకీల్‌ సాబ్‌ సినిమా చిత్రీకరణ సమయంలో కూడా కరోనా కాస్త ఇబ్బందికి గురి చేసింది.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

ఇప్పుడు థియేటర్ల నుండి ఓటీటీకి వెళ్లేలా చేసింది అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.మే 7 న అమెజాన్‌ లో భారీగానే వకీల్‌ సాబ్‌ ను చూసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

Advertisement

తాజా వార్తలు