వైష్ణవ్ తేజ్ - శ్రీలీల 'ఆదికేశవ' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇది కూడా ఆగస్టులోనే..

మెగా హీరోల్లో వైష్ణవ్ తేజ్( Vaishnav Tej ) ఒకరు.ఈయన హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ప్రేక్షకుల చేత శబాష్ అనిపించు కున్నాడు.

బుచ్చిబాబు సానా( Buchi Babu Sana ) దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమా ద్వారా వైష్ణవ్ తేజ్ తెలుగు సినిమా తెరకు పరిచయం అయ్యి ఫస్ట్ మూవీ తోనే 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు.అయితే ఉప్పెన రేంజ్ హిట్ ను మాత్రం అందుకోలేక పోతున్నాడు.

ఇటీవలే వైష్ణవ్ తేజ్ రంగరంగ వైభవంగా సినిమాతో వచ్చాడు.కానీ ఈ సినిమా పాజిటివ్ టాక్ రాకపోవడంతో ఈ సినిమా అంతగా హిట్ అందుకోలేక పోయింది.

దీంతో ఈ మెగా హీరో కెరీర్ డైలమాలో పడింది.వరుస ప్లాపులతో ఈయన మార్కెట్ భారీగా డౌన్ అయ్యింది.

Advertisement

ప్రెజెంట్ ఈయన తన 4వ సినిమాతో బిజీగా ఉన్నాడు.ఆదికేశవ( Adikesava ) అనే టైటిల్ ను ఈ సినిమాకు అనౌన్స్ చేసాడు.

ఈ సినిమాను శ్రీకాంత్ రెడ్డి ( Srikanth Reddy )తెరకెక్కిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై త్రివిక్రమ్ భార్య సౌజన్యతో కలిసి నాగవంశీ నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో తేజ్ కు జోడీగా ధమాకా బ్యూటీ శ్రీలీల( Srilila ) హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి స్పందన వచ్చింది.

అందులోను శ్రీలీల హీరోయిన్ కావడం ఈ సినిమాకు ప్లస్ అయ్యింది.

తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.ఈ సినిమాను ఆగస్టు 18న రిలీజ్ చేయబోతున్నట్టు పోస్టర్ తో క్లారిటీ ఇచ్చేసారు.ఇప్పటికే ఆగస్టులో మెగా హీరోలు ఇద్దరు రాబోతున్నారు.

పుష్పరాజ్ కూతురు కావేరిని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే?
కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు

మెగాస్టార్ భోళా శంకర్ ఆగస్టు 11న రిలీజ్ అవుతుంటే వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున ఆగస్టు 25న రిలీజ్ కాబోతుంది.మరి వీరి మధ్యలో ఇప్పుడు ఆదికేశవ సినిమాతో వైష్ణవ్ తేజ్ రాబోతున్నాడు.

Advertisement

చూడాలి ఈయన కెరీర్ కు ఈ మూవీ ఎంత ప్లస్ అవుతుందో.

తాజా వార్తలు