రెండవ సినిమాతోనే మెగా హీరో అంతటి సాహసం చేశాడా?

మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావాల్సి ఉంది.

కాని ఇప్పటి వరకు కరోనా కారణంగా ఉప్పెన సినిమా విడుదల అవ్వలేదు.

సంక్రాంతి సినిమా తర్వాత ఉప్పెనను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఉప్పెనకు ఓటీటీ ఆఫర్‌ వచ్చింది.

కాని మొదటి సినిమాను ఓటీటీలో కాకుండా థియేటర్లలో విడుదల చేస్తే బాగుంటుందనే ఉద్దేశ్యం తో వైష్ణవ్‌ తేజ్‌ రిక్వెస్ట్‌ మేరకు ఓటీటీ విడుదల విషయంలో ఎలాంటి నిర్ణయాన్ని నిర్మాతలు తీసుకోలేదు.నష్టం వచ్చినా కూడా పర్వాలేదు వచ్చే సంక్రాంతి తర్వాత థియేటర్లలో ఉప్పెన సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి మేకర్స్‌ వచ్చారు.

ఉప్పెన వచ్చిన వెంటనే వైష్ణవ్‌ తేజ్‌ కొండ పొలం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.క్రిష్‌ దర్శకత్వంలో కొండ పొలం రూపొందుతోంది.

Advertisement

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌ గా ఈ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.ఒక ప్రముఖ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.

ఇదో కమర్షియల్‌ మూవీ కాదు.ఇందులో తెలుగు ప్రేక్షకులు కోరుకునే కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ తక్కువగా ఉంటాయి.

ఇలాంటి సినిమాను చేసేందుకు దర్శకుడికి ఘట్స్‌ ఉండాలి.ఇలాంటి సినిమాలో నటించేందుకు హీరోకు ధైర్యం ఉండాలి.

ఇలాంటి సినిమాను చేస్తున్నందుకు వైష్ణవ్‌ తేజ్‌ను అంతా అభినందిస్తున్నారు.కాని సినిమా విషయంలో ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది తెలియదు.

పుష్పరాజ్ కూతురు కావేరిని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే?
కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు

ఈ సినిమాను థియేటర్లలో కాకుండా ఓటీటీ ద్వారా విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో మేకర్స్‌ ఉన్నారు.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాను ఫిబ్రవరి లేదా మార్చిలో ప్రముఖ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

రెండవ సినిమాకే ఇంతటి సాహస నిర్ణయంను తీసుకున్న మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ను ఖచ్చితంగా అభినందించాల్సిందే.

తాజా వార్తలు