అతడితో ఈ యంగ్ బ్యూటీ లవ్ లో ఉందంటూ పుకార్లు....

తెలుగులో ఒకప్పుడు ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయిన మా టీవీలో ప్రసారమయ్యే "చిన్నారి పెళ్ళి కూతురు అనే ధారావాహిక ద్వారా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ముంబై బ్యూటీ "అవికా గోర్".

దీంతో ఈ అమ్మడికి ముంబైలో కంటే తెలుగులోనే ఎక్కువ ఫేం రావడంతో ఉయ్యాల జంపాల" అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం బాగానే రాణిస్తోంది.

కానీ చెప్పుకోవడానికి పెద్దగా ఇట్లు లేకపోయినప్పటికీ అవకాశాలు మాత్రం బాగానే వరిస్తున్నాయి.అయితే తాజాగా అవికా గోర్ గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే ఇందులో ముఖ్యంగా గత కొద్దికాలంగా బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ నటుడుతో అవికా గోర్ ప్రేమలో పడిందని తొందర్లోనే వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.అంతేగాక గత కొద్ది కాలంగా అవికా గోర్ ఆ నటుడితో కలిసి ఫంక్షన్లకి మరియు సెలవులు గడిపేందుకు వెళుతుందని ఇక ఇరు కుటుంబ సభ్యుల అనుమతి మాత్రమే పెండింగ్ లో ఉందని, వాళ్లు కూడా ఓకే అంటే తొందర్లోనే ఈ చిన్నారి పెళ్ళికూతురు కాస్త పెళ్లి కూతురు అవుతుందని చర్చించుకుంటున్నారు.

కానీ ఇప్పటివరకు అవికా గోర్ మాత్రం తన పెళ్లి విషయం పై వినిపిస్తున్న వార్తల గురించి స్పందించడం లేదు సరికదా కనీసం పట్టించుకోవడం లేదు.

Advertisement

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అవికా గోర్ సినిమా అవకాశాల కోసం బాగానే గ్లామర్ డోసు పెంచిన ట్లు తెలుస్తోంది.కాగా ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగులో దాదాపుగా మూడు చిత్రాలలో నటించే అవకాశం వరించినట్లు సమాచారం.ఇందులో అక్కినేని స్టార్ హీరో నాగ చైతన్య హీరోగా నటిస్తున్న థాంక్ యూ చిత్రంలో అవికా గోర్ ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

అలాగే నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న మరో చిత్రంలో కూడా హీరోయిన్ గా చాన్స్ దక్కించుకున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు