బాహుబలి కుండేమిటి( Bahubali Pot ) అని అనుకుంటున్నారా? దానర్ధం అది పెద్దగా ఉంటుంది మరి.ఉత్తర ప్రదేశ్ లోని( Uttar Pradesh ) కన్నౌజ్ లో అత్యంత పెద్దదైన కుండ ఒకటి బైటపడి స్థానికులను విస్మయానికి గురిచేసింది.
దాంతో దీనికోసం అధికారులు ప్రత్యేకంగా ఒక మ్యూజియం ను ఏర్పాటు చేసి భద్ర పరిచినట్టు తెలుస్తోంది.కాగా ఈ బాహుబలి కుండను చూడటానికి స్థానికులుతో పాటు, సమీప ప్రాంతంలోని ప్రజలు తండోపతండాలుగా తరలి వెళ్తున్నారు.
ఈ కుండ ప్రస్తుతం.ప్రసిద్ధి చెందిన కన్నౌజ్ మ్యూజియంలో భద్రపరచబడింది.
ఈ కుండకి 2 వేల లీటర్ల సామర్థం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.ఈ కుండ సుమారు 40 సంవత్సరాల క్రితం నగరంలోని షేక్‌పురా ప్రాంతంలో తవ్వకాలలో బైటపడినట్లు తెలుస్తోంది.చక్రవర్తి హర్షవర్ధన్, జైచంద్ రాజుల సామ్రాజ్యంగా ఈ జిల్లా చరిత్ర చాలా పురాతనమైనదని అంటున్నారు.ఇక్కడ తవ్వకాల్లో అప్పుడప్పుడు అరుదైన విషయాలు బయటపడుతూనే వున్నాయట.మొదటి, మూడవ శతాబ్దాల మధ్య కుషాన్ రాజవంశం కాలంలో ఇది అతిపెద్ద పిచర్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది.
సుమారు 1500 సంవత్సరాల క్రితం తయారు చేసిన ఈ కుండ ( Pot ) ఎత్తు సుమారు 5.4 అడుగులు కాగా, వెడల్పు 4.5 అడుగులుగా ఉంది.ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత పురాతనమైన కుండగా దీనిని చెబుతున్నారు.కన్నౌజ్‌లో 50 ఏళ్లకు పైగా పురావస్తు శాఖ ఎప్పటికప్పుడు ఇక్కడ తవ్వకాలు జరుపుతోంది.కన్నౌజ్ పేరు చరిత్ర, వేద పురాణాలలో నమోదు చేయబడింది.దీని వల్ల ఇక్కడ తవ్వకాలు జరిపినప్పుడల్లా ఇలాంటివి బయటికి వస్తూ వున్నాయి.
వివిధ శతాబ్దాల నాటి శాసనాలు, శిల్పాలు, పాత్రలు, రాళ్లు కూడా ఇక్కడ బయటకు వస్తూనే ఉన్నాయి.హిందూ జైన, బౌద్ధమతానికి సంబంధించిన అనేక వారసత్వాలు ఇక్కడ భద్రపరచబడ్డాయి.