హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ లు పలువురు నేతలతో వరుసగా భేటీ అవుతున్నారని సమాచారం.
కొద్ది రోజులుగా రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతల మధ్య గ్యాప్ పెరుగుతోందని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ లు.రాష్ట్రానికి చెందిన డీకే అరుణ, బండి సంజయ్, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు మరి కొంతమంది నేతలతో చర్చలు జరుపుతున్నారు.ప్రస్తుత పార్టీ పరిస్థితితో పాటు నేతల పనితీరుపై అభిప్రాయాలను సేకరిస్తున్నారు.
మరోవైపు నాయకులు విభేదాలు పక్కన పెట్టాలని బన్సల్ సూచిస్తున్నారు.తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పని చేయాలని దిశా నిర్దేశం చేశారు.







