యూపీ వైపు రాహుల్ చూపు

బీహార్లో గౌరవనీయమైన గెలుపు సాధించిన తరువాత కాంగ్రెస్ పార్టీలో ఆత్మవిశ్వాసం పెరిగినట్లు కనబడుతోంది.

గత ఎన్నికల తరువాత పూర్తిగా కుదేలైన కాంగ్రెస్కు బీహార్ ఎన్నికలు ఊపిరి పోశాయి.

మహా కూటమి కారణంగా 27 స్థానాలు గెలుచుకొని మంత్రివర్గంలో స్థానం సంపాదించింది.బీహార్ గెలుపు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చలవేనని పార్టీ నాయకులు పొగుడుతున్నారు.

పార్టీలో రాహుల్ విలువ పెరిగింది.వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి.

కానీ కాంగ్రెస్కు ఆ రాష్ట్రాల కంటే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ముఖ్యం.ఆ ఎన్నికలు 2017లో జరుగుతాయి.

Advertisement

అక్కడ అధికారంలోకి వస్తే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మళ్ళీ దిల్లీకి చేరుకోవచ్చని కాంగ్రెస్ ఆశ.బీహార్లో అంతకు ముందు అసెంబ్లీలో నాలుగు సీట్లు ఉండగా, మొన్నటి ఎన్నికల్లో 27 సీట్లు వచ్చాయి.యూపీలో కూడా ఇదే జారుతుందని నాయకులు చెబుతున్నారు.

ప్రస్తుతం అక్కడి అసెంబ్లీలో 28 సీట్లు ఉన్నాయి.ఈ సంఖ్య బాగా పెరగాలంటే ఇప్పటి నుంచే బాగా కష్టపడాలి.

అందుకే రాహుల్ గాంధీ ఈ 23న యూపీలో కిసాన్ యాత్ర పేరుతో పాదయాత్ర చేయబోతున్నారు.రాహుల్ మొదటి నుంచి రైతు సమస్యలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు.

పలు రాష్ట్రాల్లో పాద యాత్రలు చేశారు.గతంలో ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల్లో కూడా పాదయాత్రలు చేశారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు

ఇప్పుడు యూపీలో ప్రారంభించారు.ఎన్నికల నాటికీ చాలా యాత్రలు చేసే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు