హెచ్ 1 బీ వీసాకు( H-1B Visa ) సంబంధించి అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.హెచ్ 1 బీ వీసా పునరుద్ధరణ కార్యక్రమాన్ని మరింత సులభతరం చేసేందుకు గాను చర్యలు చేపట్టింది.
దీనిలో భాగంగా కొన్ని కేటగిరీలకు చెందిన హెచ్ 1బీ వీసాలను దేశీయంగానే రెన్యువల్( H-1B Visa Renewal ) చేసుకునేలా ప్రయోగాత్మకంగా ఓ ప్రాజెక్ట్‌ను డిసెంబర్లో ప్రారంభించనున్నారు.ఈ మేరకు వీసా సేవల డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ జూలీ స్టఫ్ వెల్లడించారు.
దీని ప్రకారం తొలుత 20 వేల మందికి వీసా రెన్యువల్ చేయనున్నారు.మూడు నెలల పాటు ఈ పైలట్ ప్రోగ్రామ్ అందుబాటులో వుంటుందని జూలీ తెలిపారు.
భారతీయుల నుంచే అమెరికా వీసాలకు( US Visa ) ఎక్కువ డిమాండ్ వుందని.అందువల్ల వారికి వీలైనంత త్వరగా వీసా అపాయింట్మెంట్లు ఇచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామని జూలీ స్టఫ్ చెప్పారు.
డిసెంబర్ నుంచి మూడు నెలల పాటు అమెరికాలో వుంటున్న హెచ్ 1 బీ వీసాదారులు. వారి సొంత దేశాలకు వెళ్లకుండానే నేరుగా యూఎస్‌లో వుండే వీసాలను పునరుద్ధరణ చేసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు.
వీరిలో మెజారిటీ భాగం భారతదేశానికి చెందినవారే వుంటారని జూలీ పేర్కొన్నారు .దీని వల్ల భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయాలపై పని భారం తగ్గి.కొత్త దరఖాస్తులపై దృష్టి పెట్టొచ్చని ఆమె వెల్లడించారు.ఈ వీసా రెన్యువల్ ప్రోగ్రామ్‌కు ఎవరెవరు అర్హులు.ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే దానిపై త్వరలోనే అధికారిక ప్రకటన జారీ చేస్తామని జూలీ చెప్పారు

కాగా.నైపుణ్యం కలిగిన విదేశీ వృత్తి నిపుణులు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసుకునేందుకు వీలు కల్పించే హెచ్ 1 బీ వీసాలకు సంబంధించి ఎప్పుడూ ఏదో వివాదం వుంటూనే వుంటుంది.ఏటా హెచ్-1బీ వీసాల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటాయి.వీటిలో కంప్యూటర్ ఆధారిత లాటరీ పద్ధతి ద్వారా 65వేల దరఖాస్తులను ఎంపిక చేసి అమెరికా వీసా జారీ చేస్తుంది.
వీటితో పాటు సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్(STEM) విభాగాల్లో అమెరికా యూనివర్శిటీల్లో ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు మరో 20వేల వీసాలు ఇస్తారు.అంటే మొత్తం 85 వేల హెచ్ 1 బీ వీసాలన్న మాట.

హెచ్ 1 బీ వీసా కలిగిన వారు తమ వీసా రెన్యువల్ , స్టాంపింగ్ సేవల కోసం వారి సొంత దేశానికి వెళ్లాల్సి వుంటుంది.ఆయా దేశాల్లో వున్న అమెరికా దౌత్య కార్యాలయాల్లో ఈ సేవలు లభిస్తాయి.అయితే ఇందుకోసం దరఖాస్తుదారులు నెలల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది.ఈ ఇబ్బందులను పరిగణనలోనికి తీసుకున్న అమెరికా ప్రభుత్వం ఇలాంటి వారికి ఊరట కలిగేలా తాజా నిర్ణయం తీసుకుంది.







