పూర్వకాలంలో ప్రజలు ఏ చిన్న వ్యాధి కైనా ఆయుర్వేద వైద్యాన్ని ఉపయోగించేవారు.అలాగే చిన్న నొప్పుల నుంచి మొదలుకొని దీర్ఘకాలిక వ్యాధుల వరకు ఆయుర్వేద శాస్త్రంలో అన్ని మూలికలు ఉన్నాయని పెద్దవారు చెబుతూ ఉంటారు.
తరచుగా అనారోగ్య సమస్యలతో( Health problems ) బాధపడేవారు ఇప్పటికీ ఆయుర్వేద చిట్కాలను ఉపయోగిస్తూ ఉన్నారు.కాబట్టి ఆయుర్వేదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
ఆయుర్వేదం ప్రకారం ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క మూలికను ఉపయోగించాల్సి ఉంటుంది.తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆయుర్వేద మూలికలలో ఒకటైన అతి మధురం చూర్ణాన్ని( Athimadhuram Powder ) ఉపయోగించాలి.

ఇందులో గొప్ప ఔషధ గుణాలు ఉన్నాయి.కాబట్టి ఇది గొంతు నొప్పి( sore throat ) నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.దీంతో పాటు శరీరానికి కొన్ని లాభాలు కూడా కలుగుతాయి.మరి ఆ లాభల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.అతి మధురం చూర్ణాన్ని వినియోగించడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు ఉన్నాయి.ప్రస్తుతం ఈ చూర్ణాన్ని చలికాలంలో గొంతు నొప్పి ఇతర ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న వారు దీనిని ఉపయోగిస్తూ ఉన్నారు.
ఇలాంటి వారికి అతి మధుర చూర్ణం ప్రభావంతంగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఇందులో ఉండే గుణాలు గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగించి ఇన్ఫెక్షన్ నుంచి దూరం చేసేందుకు ప్రభావంతంగా పని చేస్తాయి.

అంతే కాకుండా చలికాలంలో చాలా మందిలో చర్మ సమస్యలు ( Skin problems )కూడా వస్తూ ఉంటాయి.ఇలాంటి సమస్యలకు కూడా ఈ చూర్ణం ఎంతో బాగా ఉపయోగపడుతుంది.అతి మధురం చూర్ణాన్ని తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు.అతిమధురం చూర్ణాన్ని టీలా చేసుకొని ప్రతి రోజు రెండు నుంచి మూడుసార్లు తాగడం వల్ల జీర్ణ క్రియ సమస్యలు ( Digestive problems )సులభంగా దూరమైపోతాయి.
అంతే కాకుండా చలి కాలంలో వచ్చే రోగ నిరోధక సమస్యలు, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.అంతే కాకుండా బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది.







