అమెరికా : స్కూళ్లలోకి టీచర్లు హ్యాండ్‌ గన్ తీసుకెళ్లేలా .. కీలక బిల్లుకు టెన్నెస్సీ ఆమోదం

అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్( Gun Culture in America ) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.నగదు, నగలు కోసం హత్యలు చేసేవారు కొందరైతే.

జాతి, వర్ణ వివక్షలతో ఉన్మాదులుగా మారేవారు మరికొందరు.ఏది ఏమైనా అక్కడ గన్ కల్చర్ వల్ల ఏటా వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.

దీనికి చెక్ పెట్టాలని ప్రభుత్వాలు కృషి చేస్తున్నా.శక్తివంతమైన గన్ లాబీ ఈ ప్రయత్నాలను అడ్డుకుంటోందన్న వాదనలు వున్నాయి.

ఇక తుపాకీ కాల్పుల్లో భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో మరణిస్తున్నారు.ఇదిలావుండగా అమెరికాలోని టెన్నెస్సీ ( Tennessee )రాష్ట్రం పాఠశాల ఉపాధ్యాయులు , సిబ్బంది హ్యాండ్ గన్‌లను తీసుకెళ్లడానికి అనుమతించే బిల్‌ను ఆమోదించింది.

Advertisement

నాష్‌విల్లేలో జరిగిన కాల్పుల ఘటనలో ఆరుగురి ప్రాణాలను బలిగొన్న సరిగ్గా ఏడాది తర్వాత బిల్లు తుది ఆమోదం కోసం గవర్నర్‌కు పంపబడుతుంది.టెన్నెస్సీ హౌస్ 68-28 తేడాతో చట్టానికి అనుకూలంగా ఓటు వేసింది.

అయితే ఈ బిల్లును వ్యతిరేకించిన డెమొక్రాట్లకు నలుగురు రిపబ్లికన్ సభ్యులు మద్ధతు పలికారు.అయినప్పటికీ రిపబ్లికన్ల ఆధిపత్యం వున్న స్టేట్ సెనేట్ ఈ నెల ప్రారంభంలో బిల్లును ఆమోదించింది.

రిపబ్లికన్ రాష్ట్ర ప్రతినిధి ర్యాన్ విలియమ్సన్ ( Ryan Williamson )బిల్లును సమర్ధించారు.ప్రతిపాదిత చట్టం ప్రకారం .పాఠశాల మైదానంలో దాచిన హ్యాండ్ గన్స్‌ను తీసుకెళ్లానుకునే అధ్యాపకులు, సిబ్బంది ప్రతి ఏడాది ప్రత్యేకంగా స్కూల్ పోలీసింగ్‌కు సంబంధించి కనీసం 40 గంటల ఆమోదిత శిక్షణను పూర్తి చేయాల్సి వుంటుంది.ప్రొసీడింగ్ సమయంలో .గ్యాలరీలోని నిరసనకారులు “ Blood on your hands ” అంటూ నినాదాలు చేశారు.

మరోవైపు టెన్నెస్సీ రాష్ట్ర గవర్నర్ బిల్ లీ( Governor Bill Lee ) ఈ చట్టం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది.గవర్నర్ తన పదవీకాలంలో ఎప్పుడూ వీటో అధికారాన్ని వినియోగించలేదు.ఇప్పటికే అమెరికాలోని కనీసం 26 రాష్ట్రాలు .ఉపాధ్యాయులు , ఇతర పాఠశాల ఉద్యోగులు స్కూల్ మైదానంలో తుపాకులు కలిగి వుండటానికి అనుమతించే చట్టాలు చేశాయి.డెమొక్రాటిక్ రాష్ట్ర ప్రతినిధి బో మిచెల్ గతేడాది నాష్‌విల్లేలో జరిగిన కోవ్‌నెంట్ స్కూల్ షూటింగ్‌ గురించి ప్రస్తావించారు.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?

నాటి ఘటనలో ముగ్గురు పిల్లలు, ముగ్గురు పెద్దలు ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

తాజా వార్తలు