అమెరికాలో( America ) విషాదం చేసుకుంది.బోస్టన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో( Road Accident ) ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎన్ఆర్ఐ ( Telugu NRI ) దుర్మరణం పాలయ్యాడు.
వివరాల్లోకి వెళితే.మృతుడిని 47 ఏళ్ల విశ్వచంద్ కొల్లాగా( Vishwachand Kolla ) గుర్తించారు.
ఇతను గతవారం బోస్టన్‌లోని లోగాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో మిత్రుడిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు.ఈ క్రమంలో విమానాశ్రయంలోని టెర్మినల్ బీ సమీపంలో తన కారు వద్ద వేచి వుండగా.
అదే సమయంలో డార్ట్‌మౌత్ ట్రాన్స్‌పోర్టేషన్ మోటార్ కోచ్ అతని కారును వేగంగా ఢీకొట్టింది.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విశ్వచంద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ప్రమాదం కారణంగా బస్సులో వున్న ప్రయాణీకులను కిందకు దించేయడంతో పాటు టెర్మినల్ బీ వద్ద బస్సు సేవలను రద్దు చేశారు అధికారులు.దీనిపై సమాచారం అందుకున్న మసాచుసెట్స్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.
అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇక లెక్సింగ్టన్‌లో నివసిస్తున్న విశ్వచంద్ డేటా సైంటిస్ట్. ఇటీవలే టకేడాలో డేటా అనలిటిక్స్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.గతంలో జాన్ హాన్‌కాక్, డెలాయిట్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, ఐబీఎం, సన్ మైక్రోసిస్టమ్స్‌లో మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా పనిచేశాడు.
అంతేకాదు.అమెరికాలోని ప్రవాస తెలుగు సంఘాలతోనే విశ్వచంద్‌కు బలమైన సంబంధాలున్నాయి.
ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్, గ్రేటర్ బోస్టన్ తెలుగు అసోసియేషన్‌లో ఈయన యాక్టీవ్ మెంబర్‌గా తెలుస్తోంది.విశ్వచంద్‌కు భార్య, ఇద్దరు పిల్లలు వున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.
అతని మరణవార్త తెలుసుకున్న భారత్‌లోని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
కాగా.ఈ నెల ప్రారంభంలో అమెరికాలో జరిగిన రైలు ప్రమాదంలో ఓ తెలుగు వ్యక్తి దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.మృతుడిని శ్రీకాంత్ దిగాలాగా గుర్తించారు.
ఇతని స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా .ప్రిన్స్‌టన్ జంక్షన్ స్టేషన్‌లో జరిగిన రైలు ప్రమాదంలో శ్రీకాంత్ ప్రాణాలు కోల్పోయాడు.ఇతను న్యూజెర్సీలోని ప్లెయిన్స్‌బోరోలో నివసిస్తున్నాడు.ఆమ్‌ట్రాక్ రైలు 178 వాషింగ్టన్ నుంచి బోస్టన్‌కు వెళ్తుండగా.ప్రిన్స్‌టన్ జంక్షన్‌కు తూర్పువైపున శ్రీకాంత్ ప్రమాదానికి గురయ్యాడని ఆమ్‌ట్రాక్ ప్రతినిధి డైలీ వాయిస్ వార్తాసంస్థకు తెలిపారు.శ్రీకాంత్ దిగాలాకు భార్య, పదేళ్ల కుమారుడు వున్నారు.
కుటుంబానికి అతనే జీవనాధారం కావడంతో అతని కుటుంబానికి సహాయం చేయడానికి గో ఫండ్ మీ పేజీ ద్వారా నిధుల సేకరణకు శ్రీకారం చుట్టారు .