అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ట్రంప్‌కు వేయను .. నా ఓటు జో బైడెన్‌కే : తేల్చేసిన మెలిందా గేట్స్

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల కోలాహలం తారాస్థాయికి చేరింది.ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్,( Joe Biden ) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు మరోసారి తలపడుతున్నారు.

ఇప్పటికే ఇద్దరు నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.దేశంలోని పలు రంగాల ప్రముఖులు తమ మద్ధతు ఎవరికో చెబుతూ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నారు.

తాజాగా ఈ లిస్ట్‌‌లో చేరారు మెలిందా గేట్స్.నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు కాకుండా తాను బైడెన్‌కు ఓటు వేస్తానని మెలిందా తెలిపారు.

మహిళలు, పునరుత్పత్తి హక్కులపై ట్రంప్ చేసిన వ్యాఖ్యల కారణంగా తాను ఆయనకు ఓటు వేయకూడదని నిర్ణయించుకున్నానని వెల్లడించారు.

Us Presidential Election : Melinda Gates Announces That She Will Vote For Biden
Advertisement
Us Presidential Election : Melinda Gates Announces That She Will Vote For Biden

ఎన్నికల్లో ఎవరికి మద్ధతు ఇస్తున్నారని సీబీఎస్ మార్నింగ్స్ కో హోస్ట్ గేల్ కింగ్ అడిగిన ప్రశ్నకు మెలిందా పై విధంగా సమాధానం చెప్పారు.తన జీవితంలో కొన్నిసార్లు రిపబ్లికన్, కొన్ని సార్లు డెమొక్రాటిక్ పార్టీలకు ఓటు వేసినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు.అయితే స్త్రీల పునరుత్పత్తి హక్కులు, మహిళలపై ట్రంప్( Trump ) చేసిన నీచమైన వ్యాఖ్యలు సమర్ధనీయం కాదని.

ఈ క్రమంలోనే తాను ఆయనకు ఓటు వేయలేనని మెలిందా స్పష్టం చేశారు.నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని గేట్స్ పిలుపునిచ్చారు.

Us Presidential Election : Melinda Gates Announces That She Will Vote For Biden

పునరుత్పత్తి హక్కుల న్యాయవాదిగా అమెరికాలో మెలిందా గేట్స్‌కు గుర్తింపు ఉంది.గత నెలలో ఆమె మహిళల ప్రయోజనాల కోసం 1 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేశారు.గత వారం అబార్షన్‌ నిమిత్తం వినియోగించే ఔషధం ‘‘మైఫెప్రిస్టోన్’’( Mifepristone )ను సమర్ధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పినప్పుడు గేట్స్ హర్షం వ్యక్తం చేశారు.

అమెరికాలో పునరుత్పత్తి హక్కుల పోరాటం ముగియలేదని ఆమె ఎక్స్‌లో ట్వీట్ చేశారు.మహిళల స్వయం ప్రతిపత్తిపై ఈ దాడులను ఆపడానికి ఏకైక మార్గం .వారి ప్రాథమిక హక్కులు వేరొకరిపై ఆధారపడకుండా , వారి స్వంత ఎజెండాను నిర్దేశించుకొనే రాజకీయ శక్తిని కలిగి ఉన్నారని నిర్ధారించుకోవాలని మెలిందా పిలుపునిచ్చారు.నవంబర్‌లో ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, మీ ఆరోగ్యం, మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉండాలని ఆమె పేర్కొన్నారు.

స్టార్ హీరో విజయ్ దేవరకొండ రికార్డును బ్రేక్ చేసిన నాని.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు