ఆయనే న్యాయం చేయగలరు: ఎరిక్ గార్సెట్టి నియామకంపై చట్టసభ సభ్యులు, ఇండియన్ కమ్యూనిటీ స్పందన

భారత్‌లో తదుపరి అమెరికా రాయబారిగా లాస్ ఏంజిల్స్ మేయర్ ఎరిక్ గార్సెట్టిని జో బైడెన్ నామినేట్ చేయడంపై అక్కడి ప్రవాస భారతీయ సమాజం, ఇండో అమెరికన్ చట్టసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ పదవికి ఎరిక్ న్యాయం చేస్తారని వారు చెబుతున్నారు.

సెనేటర్ డయాన్నే ఫెయిన్‌స్టెయిన్ మాట్లాడుతూ.ప్రపంచస్థాయి ఆర్ధిక వ్యవస్థగా ఎదుగుతున్న భారత్‌ ప్రాముఖ్యత రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుందన్నారు.

అలాంటి దేశంతో అమెరికా సంబంధాలకు మార్గనిర్దేశనం చేయడానికి స్థిరమైన హస్తం వుండటం అవసరమని అన్నారు.ఎరిక్ గార్సెట్టి.

వలసదారుల సంతతికి చెందిన వ్యక్తి అని ఆయన అందరికీ అవకాశాలు కల్పించడంతో పాటు న్యాయం చేస్తారని డయాన్నే అన్నారు.అమెరికన్ విలువలను పాటిస్తూ ఎరిక్ భారత్‌లో విజేతగా నిలుస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

భారత సంతతికి చెందిన యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి మాట్లాడుతూ.కోవిడ్‌ అంతం, ఆర్ధిక సహకారం, ప్రాంతీయ భద్రత వంటి అంశాలపై ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నందున భారత్‌కు తదుపరి రాయబారిగా గార్సెట్టిని నియమించడం ఒక కీలకమైన ముందడుగుగా ఆయన అభివర్ణించారు.

ప్రపంచంలోని ప్రముఖ నగరాల మధ్య అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందిస్తూ లాస్ ఏంజిల్స్‌ను నడిపించిన మేయర్ గార్సెట్టి అనుభవం ఖచ్చితంగా ఉపయోగపడుతుందని రాజా కృష్ణమూర్తి అన్నారు.ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి.

అత్యంత ప్రాచీన ప్రజాస్వామ్య దేశాల మధ్య సంబంధాలను ఎరిక్ బలోపేతం చేస్తారని ఆయన ఆకాంక్షించారు.సిలికాన్ వ్యాలీకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఇన్వెస్టర్ ఎంఆర్ రంగస్వామి మాట్లాడుతూ.

భారత్‌లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టిని నియమించడం బైడెన్.భారత్‌తో బలమైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఎంత ఆసక్తిగా వున్నారో తెలుపుతోందన్నారు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

అమెరికాలో రెండవ అతిపెద్ద నగరమైన లాస్‌ ఏంజిల్స్‌కు మేయర్‌గా గార్సెట్టికి మంచి ట్రాక్ రికార్డ్ వుందని.అదే సమయంలో బైడెన్‌తో వ్యక్తిగత సంబంధం కూడా వుందని రంగస్వామి అన్నారు.

Advertisement

యూఎస్- ఇండియా సంబంధాలను మరింత బలోపేతం చేసే ప్రయత్నాలలో ఆయన ఇకపై ప్రధాన పాత్ర పోషిస్తారని రంగస్వామి ఆకాంక్షించారు.కాంగ్రెషనల్ ఇండియా కాకస్ కో చైర్.

బ్రాడ్ షెర్మాన్ మాట్లాడుతూ.ప్రపంచంలోని పురాతన, అతిపెద్ద ప్రజా స్వామ్య దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి గార్సెట్టితో కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా వున్నానన్నారు.

అమెరికాలో రెండవ అతిపెద్ద నగరమైన లాస్ ఏంజిల్స్ మేయర్‌గా గార్సెట్టి తన కొత్త పాత్రకు విలువను తీసుకొస్తారని ప్రముఖ ప్రవాస భారతీయ సంఘం ఇండియాస్పోరా ఒక ప్రకటనలో తెలిపింది.ఎరిక్ గార్సెట్టికి ఆసియాతో పాటు యూరప్, ఆఫ్రికాలో నివసించిన, పనిచేసిన అంతర్జాతీయ అనుభవం వుందని ఇండియాస్పోరా తెలిపింది.

ఇంపాక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నీల్ మఖిజా మాట్లాడుతూ.ప్రపంచంలోని అతిపెద్ద, పురాతన ప్రజాస్వామ్య దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి కీలకమైన రాయబారి స్థానంలో ఎరిక్ ఎంపిక అద్భుతమన్నారు.మేయర్‌గా ఆయన లాస్ ఏంజిల్స్‌లో వ్యాక్సినేషన్‌ను పరుగులు పెట్టించారని.16 ఏళ్లు పైబడిన 50 శాతం మంది ఇప్పటికే టీకా తీసుకున్నారని నీల్ అన్నారు.వాతావరణ మార్పులపై దృష్టి సారించిన ఎరిక్.

వాస్తవికతను అర్ధం చేసుకున్నారని, యూఎస్ నేవీలో పనిచేసిన ఆయనకు ఇండో పసిఫిక్ ప్రాంతంలోని భౌగోళిక పరిస్ధితులపై అవగాహన వుందని నీల్ మఖిజా అన్నారు.అత్యంత విశ్వసనీయ మిత్రదేశంగా జో బైడెన్ భావిస్తున్న భారతదేశంతో సంబంధాలను బలోపేతం చేయడంలో ఎరిక్ తన సమర్థత నిరూపించుకుంటారని నీల్ ఆకాంక్షించారు.

తాజా వార్తలు