హిందూ సంస్కృతిని నిలబెట్టే యత్నం : ఇండో అమెరికన్లను మెచ్చిన అమెరికా

హిందూ మతం చాలా పురాతనమైనది, ఇతర మతాలకు ఇది పుట్టినిల్లు లాంటిది.పర మతాలు, దేశాలకు చెందిన వారిని అంగీకరించడమే హిందూ మతంలోని గొప్పదనం.

దీని గొప్పతనాన్ని అర్థం చేసుకున్న విదేశీయులు సైతం హిందూ మతాన్ని ఆచరిస్తున్నారు.ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాల్లో స్థిరపడిన భారతీయ హిందువులు అక్కడ హైందవ సంస్కృతిని వ్యాపింపజేస్తున్నారు.

ఇందుకు అక్కడి స్థానిక ప్రభుత్వాలు సైతం అండగా నిలుస్తున్నాయి.అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో అధినేతలు సైతం తమ అధికార కార్యాలయాల్లో హైందవ పండుగలను జరుపుకోవడమే ఇందుకు నిదర్శనం.

తాజాగా హిందూ సంస్కృతిని ప్రోత్సహించినందుకు గాను పది మంది భారతీయ అమెరికన్ యువతీ, యువకులను ఎన్‌జీవో సంస్థ హిందూస్ ఆఫ్ గ్రేటర్ హ్యూస్టన్ (హెచ్‌జీహెచ్) ఘనంగా సత్కరించింది.తన పదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 19న జరిగిన కార్యక్రమంలో వీరికి అవార్డులను బహుకరించింది.

Advertisement

భారత ప్రధాని నరేంద్రమోడీ విజేతలను అభినందిస్తూ లేఖ రాశారు.ఈ అవార్డులను ప్రవాస భారతీయులకు, ముఖ్యంగా యువతకు, వారి మూలాలతో వున్న సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి ఒక అవకాశంగా ప్రధాని అభివర్ణించారు.

ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో స్థిరపడిన ప్రవాస భారతీయులు మన అద్భుతమైన సంస్కృతి, సంప్రదాయానికి రాయబారులని మోడీ అన్నారు.మన గొప్ప సాంస్కృతిక వారసత్వం భౌగోళిక సరిహద్దులను దాటి అక్కడ వేలాది సంవత్సరాలుగా కొనసాగుతోందని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు.

హ్యూస్టన్‌లోని భారత కాన్సుల్ జనరల్ అసీమ్ మహాజన్ ఈ అవార్డులను విజేతలకు బహూకరించారు.

అవార్డు గ్రహీతలు:

అనీష్ నాయక్ (సేవా ఇంటర్నేషనల్) అనుషా సత్యనారాయణ్ (హ్యూస్టన్ ఎటర్నల్ గాంధీ మ్యూజియం) నిత్యా రామన్‌కులంగర ( శ్రీ మీనాక్షి టెంపుల్ సొసైటీ) సందీప్ ప్రభాకర్ (గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ డివినిటీ) కృతి పటేల్ (బాప్స్) విపాస్చిత్ నందా (ఆర్య సమాజ్) అభిమన్యు అగర్వాల్ (హిందూ హెరిటేజ్ యూత్ క్యాంప్) రజిత్ షా (వల్లభ విద్యా మందిర్) అలాగే సనాతన్ హిందూ ధర్మానికి చెందిన నమితా పల్లోడ్, గ్రేటర్ హ్యూస్టన్‌కు చెందిన యంగ్ హిందూస్‌ సంస్థ ప్రతినిధి కోమల్ లుథ్రాలకు ప్రత్యేక అవార్డులు ప్రధానం చేశారు.కరోనా మహమ్మారి సమయంలో నిస్వార్థంగా చేసిన సేవకు 73 ఏళ్ల రిటైర్డ్ శాస్త్రవేత్త డాక్టర్ మదన్ లుథ్రాను 2020 అఖిల్ చోప్రా అన్సంగ్ హీరోస్ అవార్డుకు ఎంపిక చేశారు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

Advertisement

తాజా వార్తలు