అమెరికా భారీ ఉద్దీపన ప్యాకేజీ..ఎన్ని లక్షల కోట్లో తెలుసా...!!

అగ్ర రాజ్యం అమెరికా కరోనా మహమ్మారి దెబ్బకు చిగురుటాకులా వణికిపోయింది.

పిట్టలు రాలినట్టుగా ప్రజలు ప్రాణాలు వదిలారు, న్యూయార్క్ నగరం ఎక్కడ చూసినా శవాల దిబ్బలుగా మారిపోయాయి.

ఫలితంగా లాక్ డౌన్ రావడం, వ్యాపార సంస్థలు, ఫ్యాక్టరీలు, హోటల్స్ ఇలా ఉపాది కల్పించే వ్యవస్థలు అన్నీ మూతబడ్డాయి.దాంతో అమెరికా ఆర్ధిక పరిస్థితి అతలాకుతలం అయ్యింది.

సుమారు 3 నెలల పాటు కొనసాగిన నిర్భంధం కారణంగా అమెరికా ఆర్ధిక పరిస్థితి ఎన్నడూ లేనంత అద్వానంగా మారిపోయింది.ఒక పక్క పెరిగిపోతున్న నిరుద్యోగం, మరో పక్క లక్షలాదిగా వచ్చిపడుతున్న నిరుద్యోగ బృతి దరఖాస్తులతో ఏమి చేయాలో పాలు పోనీ పోనీ పరిస్థితి నెలకొంది.

దాంతో అమెరికా భారీ ఉద్దీపన ప్యాకీజీని ప్రకటించింది.కరోనా దెబ్బకు కుదేలైన ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు దాదాపు 900 బిలియన్ డాలర్ల భారీ ఉద్దీపన ప్యాకేజీకి ఆమోదం తెలిపింది.భారతీయ కరెన్సీ లో ఈ ప్యాకేజీ విలువ అక్షరాలా రూ.66 లక్షల కోట్లు.అమెరికా కాంగ్రెస్ ఉభయ సభలు రెండూ ఈ ప్యాకేజీ ని ఆమోదించాయి.

Advertisement

ఈ ప్యాకేజీ ద్వారా కరోనా వ్యాక్సిన్ కు నిధులు సమకూర్చడంతో పాటు, కరోన ధాటికి ఆర్ధిక భారంతో సతమతమవుతున్న పలు రంగాలకు సాయం అందించడంతో పాటు, కరోనా సమయంలో ఉపాది కోల్పోయి రోడ్డున పడిన నిరుద్యోగులకు కూడా సాయం అందుతుంది.

ముఖ్యంగా అమెరికా వ్యాప్తంగా హోటల్స్, చిన్న తరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులు తీవ్ర నష్టాల పాలయ్యారు ముందు వరుసలో వీరికి ఈ ప్యాకేజీ కింద సాయం అందుతుందని, అలాగే ఉద్యోగాలు కోల్పోయిన వారికి, పౌరులకు రూ.22 వేలు అందిస్తారు.ఇప్పటి వరకూ అమెరికా చరిత్రలో ఇంతటి భారీ ప్యాకేజీ ప్రకటించిన దాఖలాలు లేవని కరోనా దెబ్బకి మొట్టమొదటిసారి 900 బిలియన్ డాలర్లు ప్రకటించాల్సి వచ్చిందని నిపుణులు అంటున్నారు.

అమెరికా కాంగ్రెస్ లో ఆమోదం తెలిపిన ఈ ప్యాకేజీ ని ట్రంప్ ఆమోదించాల్సి ఉంది .

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు