అమెరికా… శాస్త్ర, సాంకేతిక, ఆర్ధిక రంగాల్లో అగ్రగామిగా వెలుగొందుతున్న దేశం.అందుకే ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజల ఫైనల్ డెస్టినేషన్ అమెరికాయే.
విద్య, ఉపాధి, వ్యాపార అవకాశాల కోసం ప్రతి ఏటా అగ్రరాజ్యానికి వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది.ఏదో ఒక రకంగా అమెరికాలో స్థిరపడి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ప్రపంచం భావిస్తోంది.
ఇందులో భారతీయులు సైతం వున్నారు.అక్కడి వలసదారుల్లో అత్యంత శక్తివంతమైన, బలమైన కమ్యూనిటీ ఇండియన్సే.
అందుకే అప్పు చేసైనా సరే తమ పిల్లలను అమెరికా పంపిస్తున్నారు తల్లిదండ్రులు.అక్కడ తమ పిల్లలు సంపాదిస్తుంటే ఇక్కడ గొప్పగా చెప్పుకోవడంతో పాటు ఆస్తుల్ని సంపాదించుకోవచ్చన్నది లక్షలాది మంది భారతీయ పేరెంట్స్ కల.
అలా ఎన్నో ఆశలతో భారత్ నుంచి వచ్చిన కార్మికులను వెట్టిచాకిరీ చేయించుకోవడంతో పాటు లేబర్ చట్టాలను ఉల్లంఘిస్తున్నాయి అక్కడి సంస్థలు.ముఖ్యంగా భారతీయులు ఈ విషయంలో పలుమార్లు బాధితులుగా మారిన ఘటనలు వున్నాయి.
అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ, యూఎస్‌సీఐఎస్, లేబర్ డిపార్ట్‌మెంట్ అధికారుల దాడుల్లో కంపెనీల బాగోతాలు బయటపడ్డ సందర్భాలు వున్నాయి.తాజాగా మరో వ్యవహారం బయటపడింది.ఉద్యోగం పేరుతో ఓ భారతీయుడిని అమెరికాకు తీసుకొచ్చి.టెక్ కంపెనీ తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది.
అంతేకాకుండా ఏడాది పాటు అతనికి జీతం కూడా ఇవ్వలేదు.విషయం లేబర్ డిపార్ట్‌మెంట్ వరకు వెళ్లడంతో ఏజెన్సీ రంగంలోకి దిగింది.నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆ ఉద్యోగి తరఫున కంపెనీ నుంచి ఏకంగా 85 వేల డాలర్లు (భారత కరెన్సీలో రూ.63 లక్షలు) వసూలు చేసింది.

వివరాల్లోకి వెళితే.వాయిస్‌ఎక్స్‌నెట్ అనే సాఫ్ట్‌వేర్ సంస్థకు హైదరాబాద్‌తో పాటు అమెరికాలో ఓ బ్రాంచ్ వుంది.అయితే.ఇటీవల ఓ ప్రాజెక్ట్ విషయంగా భారతీయ ఉద్యోగిని హెచ్ 1బీ వీసా కింద అమెరికాకు రప్పించింది యాజమాన్యం.అయితే అక్కడ అతడిని బెంచ్‌కే పరిమితం చేసింది.అంతేకాదు … అతడి వీసా యాక్టీవ్‌గా వుందా లేదా అన్న విషయాన్ని కూడా ఇమ్మిగ్రేషన్ శాఖ అధికారులకు తెలియజేయలేదు.ఈ వ్యవహారం కార్మిక శాఖ వరకు వెళ్లడంతో వాయిస్‌ఎక్స్‌నెట్ ఆగ్రహం వ్యక్తం చేసింది.హెచ్1బీ వీసాపై వచ్చిన విదేశీ ఉద్యోగులకు కొన్ని హక్కులు సంక్రమిస్తాయి.అమెరికా ఇమ్మగ్రేషన్ చట్టాల ప్రకారం.ఇలా వచ్చిన ఉద్యోగులను కంపెనీలు / యాజమాన్యాలు బెంచ్‌కు పరిమితం చేయడం చట్ట రీత్యా నేరం.అందుకే చేసిన నేరానికి గాను వాయిస్‌ఎక్స్‌నెట్ సంస్థకు భారీ జరిమానా విధించింది.