అమెరికా: వ్యాపారాలకు వ్యాక్సిన్ తప్పనిసరి కాదు.. జో బైడెన్‌కు కోర్ట్ షాక్.. !!!

కరోనాను కట్టడి చేయడానికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే.దీంతో అన్ని దేశాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఉద్ధృతంగా నిర్వహిస్తున్నాయి.

ప్రజలు స్వచ్ఛందంగానే వ్యాక్సిన్ వేయించుకుని ప్రభుత్వానికి సహకరిస్తున్నారు.అయితే అమెరికాలో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది.

ఇక్కడ టీకాకు వ్యతిరేకంగా ఒక వర్గం, అనుకూలంగా మరో వర్గం అన్నట్లుగా ప్రజలు, కొన్ని రాష్ట్రాలు చీలిపోయాయి.మరోవైపు అమెరికాను కరోనా నుంచి రక్షించడానికి అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా శ్రమిస్తున్నారు.

దీనిలో భాగంగానే ప్రజలంతా టీకాలు వేయించుకోవాలని కోరుతున్నారు.అయినప్పటికీ జనం వ్యాక్సిన్ తీసుకోవడానికి జంకుతున్నారు.

Advertisement

సోషల్ మీడియాలో వ్యాక్సిన్ గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి జరుగుతుండటం వల్లే ఈ పరిస్ధితి ఎదురవుతోంది.ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు సామాజిక మాధ్యమాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

సామాజిక మాధ్యమాలు అన్యాయంగా ప్రజలను చంపేస్తున్నాయని బైడెన్ ఇటీవల వ్యాఖ్యానించారు.ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

అంతేగాక వ్యాక్సిన్ వేసుకోనివారిలోనే వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటోందని గుర్తు చేశారు.కనుక సాధ్యమైనంత త్వరగా టీకాలు తీసుకోవడం మంచిదని బైడెన్ దేశ ప్రజలకు సూచించారు.

అంతేకాదు కొన్ని రంగాలకు ఆయన వ్యాక్సినేషన్ తప్పనిసరి చేశారు.ఈ నేపథ్యంలో బైడెన్‌కు యూఎస్ ఫెడరల్ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.100 కంటే ఎక్కువ మంది ఉద్యోగులతో వున్న వ్యాపార సంస్థలు ఖచ్చితంగా టీకా తీసుకోవాలని ఆయన జారీ చేసిన ఆదేశాన్ని యూఎస్ ఫెడరల్ అప్పీల్స్ కోర్ట్ శనివారం నిలిపివేసింది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

న్యూఓర్లీన్స్‌కు చెందిన యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఫర్ ది ఫిఫ్త్ సర్క్యూట్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.అంతేకాకుండా సోమవారం సాయంత్రం 5 గంటలలోపై వ్యాక్సినేషన్ నిలిపివేతపై సమాధానం ఇవ్వాల్సిందిగా ఫెడరల్ కోర్టును ఆదేశించింది.ఐదు బలమైన రిపబ్లికన్ రాష్ట్రాలు (టెక్సాస్, లూసియానా, సౌత్ కరోలినా, ఉటా, మిస్సిస్సిప్పి)లతో పాటు అనేక ప్రైవేట్ కంపెనీలు పిటిషన్ దాఖలు చేసిన వాటిలో వున్నాయి.

Advertisement

నవంబర్ మొదటి వారం నాటికి అమెరికా జనాభాలో దాదాపు 58 శాతం మందికి వ్యాక్సినేషన్ జరిగింది.ఈ నేపథ్యంలో బడా కంపెనీలలో పనిచేసే ఉద్యోగులకు పూర్తిగా టీకాలు వేయాలని.

దీనికి జనవరి 4 వరకు డెడ్‌లైన్ విధించారు బైడెన్.ఈ నిబంధన దేశంలోని మూడింట రెండొంతుల కంటే ఎక్కువమంది ఉద్యోగులను ప్రభావితం చేస్తుందని ప్రభుత్వం ఆశించింది.

దీని ప్రకారం కొన్ని సంస్థలు తమ సిబ్బందికి వ్యాక్సిన్ వేయించాయి కూడా.కోర్టు తీర్పుతో శీతాకాలం మరో కోవిడ్ వేవ్ రాకుండా.

లక్షలాది మంది అమెరికా కార్మికులు, ఉద్యోగులకు వ్యాక్సిన్ ద్వారా రోగనిరోధక శక్తిని పెంచాలన్న బైడెన్ యత్నాలపై నీళ్లు చల్లినట్లయ్యింది.

తాజా వార్తలు