37 రోజులు, పడుతూ.. లేస్తూ ప్రయాణం: వ్యాక్సినేషన్‌లో మైలురాయిని చేరిన అమెరికా

కరోనాతో తీవ్రంగా నష్టపోయిన అమెరికా .తన పౌరులను కాపాడుకునేందుకు గాను వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ఈ క్రమంలో అగ్రరాజ్యం అరుదైన మైలురాయిని అందుకుంది.శుక్రవారం నాటికి దేశంలో 50 మిలియన్ల మందికి వ్యాక్సినేషన్ అందించినట్లు ప్రకటించింది.

గతేడాది డిసెంబర్ 14 నుంచి అమెరికాలో టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది.ఫైజర్ సంస్థ అభివృద్ది చేసిన టీకాను అత్యవసర వినియోగానికి అనుమతించింది.

దీనిలో భాగంగా తొలి టీకాను ఓ నర్సుకు అందజేశారు అధికారులు.క్వీన్స్‌లోని లాంగ్ ఐలాండ్‌ యూదు మెడికల్ సెంటర్‌లో క్రిటికల్ కేర్‌లో నర్సుగా పనిచేస్తున్న సాండ్రా లిండ్స్‌ అమెరికాలో తొలి కోవిడ్ టీకా తీసుకున్న వ్యక్తిగా చరిత్ర పుటల్లోకెక్కారు.

Advertisement

వ్యాక్సిన్ తీసుకునేందుకు కోట్లాది మంది అమెరికన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ .టీకా తీసుకున్న పలువురిలో అలర్జీ లక్షణాలు కనిపించడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది.ఈ పరిణామాల నేపథ్యంలో అనాఫిలాక్సిన్‌ లక్షణాలు ఉన్న వారు వ్యాక్సిన్‌ తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

పలు నిర్దిష్ట ఔషధాలు, ఆహార పదార్ధాలు తదితరాల వల్ల అలెర్జీ తలెత్తే ఆరోగ్య పరిస్థితిని అనాఫిలాక్సిస్‌ అంటారు.ఈ సమస్య ఉన్నవారు ఫైజర్‌-బయో ఎంటెక్‌ వ్యాక్సిన్‌ తీసుకోవద్దని బ్రిటిష్ మెడికల్‌ రెగ్యులరేటర్‌ సూచించింది.

అయితే యూఎస్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ మాత్రం అలెర్జీ లక్షణాలు ఉన్న వారు ఈ వ్యాక్సిన్‌ తీసుకున్నా సురక్షితంగా ఉన్నారని తెలిపింది.వ్యాక్సిన్లు, దానిలోని సమ్మేళనాల పట్ల ఎలర్జీ ఉన్నవారు మాత్రమే ఫైజర్‌ టీకాను వినియోగించవద్దని డ్రగ్ ఏజెన్సీ సూచించింది.

ఈ పరస్పర విరుద్ధ ప్రకటనల నేపథ్యంలో ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడానికి భయపడ్డారు.టీకా తీసుకోవడం మంచిదేనా, ఏమైనా దుష్పరిణామాలు తలెత్తితే పరిస్ధితేంటీ అన్న ఆందోళన పలువురిని వెంటాడుతోంది.అయితే ప్రజల్లో అవగాహన కల్పించేందుకు దేశాధినేతలు, సెలబ్రెటీలు, స్వచ్ఛంద సంస్థలు ఎంతగానో కృషి చేస్తున్నాయి.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?

స్వయంగా అధ్యక్షుడు జో బైడెన్ సహా ఇతర ప్రముఖులు బహిరంగంగా వ్యాక్సిన్ తీసుకున్నా అమెరికన్లు మాత్రం వెనుకంజ వేస్తున్నారు.ఇలాంటి క్లిష్ట పరిస్దితులను దాటుకుని 5 కోట్ల మందికి వ్యాక్సిన్ పంపిణీ చేయడం పట్ల జో బైడెన్ హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

అయితే దీనికి సంబరపడిపోయి విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం కాదని అధ్యక్షుడు హెచ్చరించారు.భౌతిక దూరం పాటించడం, మాస్కులను ధరించడం వంటి నిబంధనలను ప్రజలు కచ్చితంగా పాటించాలని ఆయన కోరారు.

ప్రభుత్వ సూచనలను మెజార్టీ అమెరికన్లు పాటించడం వల్లే కరోనాపై పోరాటంలో మంచి స్థితికి చేరుకుంటున్నామని బైడెన్ తెలిపారు.

తాజా వార్తలు