ఒకప్పుడు పొలం పని.. ఇప్పుడు ఐఏఎస్.. ఇతని సక్సెస్ స్టోరీ వింటే గ్రేట్ అనాల్సిందే!

ఒకవైపు పొలాల్లో పని చేస్తూ మరోవైపు సివిల్స్ ర్యాంక్( Civils Rank ) సాధించడం సులువు కాదు.

ఎంతో కష్టపడితే మాత్రమే సివిల్స్ లో ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.

యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలో మంచి ఫలితాలు సాధించిన ఆనంద్ కుమార్ సింగ్( Anand Kumar Singh ) సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతో ఆకట్టుకుంటోంది.చిన్న గ్రామంలో జన్మించిన ఆనంద్ తల్లీదండ్రులు వ్యవసాయం( Agriculture ) చేసేవారు.

ఆర్థిక అడ్డంకుల వల్ల చదువు విషయంలో ఆనంద్ కు ఇబ్బందులు ఎదురయ్యాయి.కుటుంబానికి వచ్చే ఆదాయం తక్కువగా ఉండటంతో ఆనంద్ సైతం పొలం పనులు చేస్తూ చదువుకోసాగాడు.

సోదరుడు అనూజ్ సింగ్ సపోర్ట్ గా నిలవడంతో ఆనంద్ చదువుపై దృష్టి పెట్టి సక్సెస్ అయ్యారు.ఉన్నత చదువుల కోసం ఢిల్లీకి వెళ్లిన ఆనంద్ ఎలాంటి కోచింగ్ లేకుండా సివిల్స్ కోసం ప్రిపేర్ అయ్యి సక్సెస్ అయ్యారు.

Advertisement
Upsc Civils Ranker Ias Anand Kumar Singh Inspirational Success Story Details, Ia

రెండుసార్లు ఆశించిన ఫలితం రాకపోయినా ఆనంద్ కు మూడో ప్రయత్నంలో కోరుకున్న సక్సెస్ దక్కింది.

Upsc Civils Ranker Ias Anand Kumar Singh Inspirational Success Story Details, Ia

యూపీఎస్సీ సివిల్స్ లో( UPSC Civils ) మూడో ప్రయత్నంలో ఆనంద్ కు 184వ ర్యాంక్ సొంతమైంది.హిందీ మాధ్యమంలో యూపీఎస్సీ పరీక్ష రాసి సక్సెస్ సాధించడం ఆనంద్ కు మాత్రమే సాధ్యమైందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సోదరుడు అనూజ్ వల్లే కెరీర్ పరంగా సక్సెస్ అయ్యానని ఆనంద్ చెబుతున్నారు.

నా సక్సెస్ ను అన్న అనూజ్ కు( Anuj ) అంకితం ఇస్తున్నానని ఆనంద్ కామెంట్లు చేశారు.

Upsc Civils Ranker Ias Anand Kumar Singh Inspirational Success Story Details, Ia

టాపర్స్ ఇచ్చిన ఇంటర్వ్యూలను స్పూర్తిగా తీసుకోవడం వల్ల కోరుకున్న సక్సెస్ ను( Success ) సొంతం చేసుకోవడం సాధ్యమైందని ఆనంద్ చెబుతున్నారు.తన ఇంటర్వ్యూ 25 నిమిషాల పాటు సాగిందని ఐదుగురు సభ్యుల ప్యానెల్ ఇంటర్వ్యూ చేసిందని ఆనంద్ చెప్పుకొచ్చారు.పొలానికి సంబంధించిన అన్ని పనులు చేస్తానని ఆనంద్ చెప్పుకొచ్చారు.

ఈ రెండు ఉంటే చాలు పైసా ఖర్చు లేకుండా వైట్ అండ్ గ్లాస్ స్కిన్ ను పొందొచ్చు!
జర్మనీ బీచ్‌ల‌లో షాకింగ్ రూల్స్.. బట్టలు వేసుకుంటే ఇక గెంటేస్తారట..?

ఆనంద్ కుమార్ సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు