ఆ తాత వయసు 98 అయినా పనిలో ఆయనకీ ఆయనే సాటి

వృద్ధాప్యం ప్రతి మనిషి జీవితంలో ఉంటుంది.అయితే చాలా మంది ఎబ్భై ఏళ్ళు దాటిన తర్వాత వృద్ధాప్యంలోకి అడుగుపెట్టగానే పూర్తిగా శరీరానికి పని చెప్పడం మానేస్తారు.

వ్యాపారాలు, సినిమాలు, ఇతర రంగాలలో ఉండేవారు తప్ప సామాన్య, మధ్యతరగతి కుటుంబాలలో వృద్ధాప్యంలో కుటుంబ బాద్యతల నుంచి తప్పుకొని పిల్లలు తెచ్చే సంపాదన మీద బ్రతుకుతూ ఉంటారు.అయితే ప్రస్తుతం సమాజంలో బంధాలు, బాద్యతలు అనేవి పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితిలో ఉన్నాయి.

అందుకే పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులని వృద్ధాప్యంలో పిల్లలు గాలికి వదిలేస్తున్నారు.ఈ నేపధ్యంలో వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా కొంత మంది పిల్లల మీద ఆధారపడటం ఇష్టం లేక కాయా కష్టం చేసుకొని బ్రతుకున్నంత వరకు కష్టపడదాం అనే అభిప్రాయంతో ఉంటున్నారు.

ఇప్పుడు అలాగే వంద ఏళ్లకి దగ్గరవుతున్న ఓ తాత కూడా ఇంటిపట్టున ఉండకుండా వీధిలో శనగలు అమ్ముకుంటున్నాడు. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని రాయ్ బ‌రేలీకి చెందిన 98 ఏళ్ల విజ‌య్ పాల్ సింగ్‌.ఇప్ప‌టికీ ఎవ‌రి మీద ఆధార‌ప‌డ‌కుండా సొంతంగా సంపాదించుకుంటూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.ప్ర‌తి రోజు శ‌నిగ‌లు, గుడాలు అమ్ముతూ జీవ‌నం సాగిస్తున్నాడు.

Advertisement

ఈ వ‌య‌సులో ఆ తాత అంత‌గా క‌ష్ట‌ప‌డుతున్నాడు అంటే అత‌న్ని చూసుకునేవారు ఎవ‌రు లేర‌ని అనుకుంటే పొర‌పాటే.అత‌నికి పెద్ద కుటుంబమే ఉంది.వాళ్లు సంపాదిస్తే ఆయ‌న కూర్చొని తినొచ్చు.

కానీ అలా ఇంట్లో ఖాళీగా కూర్చోవ‌డం ఈ తాత‌కు న‌చ్చ‌దని‌, ప‌నిచేస్తేనే హుషారుగా అనిపిస్తుందని ఆ తాత చెబుతున్నాడు.ఇంట్లో ఖాళీగా కూర్చుంటే అనారోగ్యంగా ఉన్న‌ట్టుగా అనిపిస్తుందని అంటున్నాడు‌.

ఆ తాతకి సంబందించిన వీడియోని ఎవరో ట్విట్టర్ లో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్ అయ్యింది.అందరికి స్పూర్తినిచ్చేలా ఉన్న ఆ తాతని రాయ్ బరేలీ కలెక్టర్ సత్కరించి చిరు సాయం అందించారు.

వీధి ఆవులకు రొట్టెలు పెడుతున్న మహిళ.. వీడియో చూస్తే ఫిదా..
Advertisement

తాజా వార్తలు