ఐనా తగ్గేది లేదు బాసు.. బేబమ్మ మరింత పెంచింది

ఉప్పెన సినిమా తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతిశెట్టి.మొదటి సినిమా కు ఈమె పారితోషికం చాలా తక్కువ.

అప్పటి వరకు సినిమాలేమి చేయక పోవడం వల్ల అప్పటికి ఆమెకు ఆ పారితోషికం ఎక్కువే.అప్పటి నుండి ఇప్పటి వరకు ముద్దుగుమ్మ కృతి యొక్క పారితోషికం గురించి చర్చ జరుగుతూనే ఉంది.

హీరోయిన్ గా సినిమా సినిమా కు ఈ అమ్మడు తన పారితోషికంను పెంచేస్తుంది.ఉప్పెన సినిమా సక్సెస్‌ తో ఏకంగా 75 లక్షల రూపాయల పారితోషికం ను ఈ అమ్మడు డిమాండ్‌ చేసిన విషయం తెల్సిందే.

ఉప్పెన విడుదలకు ముందు ది వారియర్‌ సినిమా ను ఓకే చెప్పింది.కనుక 50 లక్షల రూపాయల పారితోషికం ను కృతి తీసుకుంది.

Advertisement

బంగార్రాజు మరియు శ్యామ్‌ సింగ రాయ్ సినిమా లు సూపర్ హిట్ అవ్వడం తో కోటి వరకు డిమాండ్‌ చేస్తోంది.తాజాగా ది వారియర్ సినిమా విడుదల అయ్యింది.

సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.అయినా కూడా ఆ సినిమా లో కృతి శెట్టి పాత్రకు మంచి మార్కులు పడ్డాయి.

అందుకే ది వారియర్‌ ప్లాప్‌ తో సంబందం లేకుండా ఏకంగా 20 నుండి 25 లక్షల రూపాయల పారితోషికంను ఈ అమ్మడు పెంచిందనే వార్తలు వస్తున్నాయి.ఇక నుండి ఈమె సైన్‌ చేయబోతున్న ప్రతి సినిమా కూడా పెరిగిన పారితోషికం తోనే చేయబోతుందట.

అందుకోసం ఇప్పటికే ఈ అమ్మడి ని సంప్రదించిన నిర్మాతలకు మెసేజ్ లు వెళ్లి పోయాయట.ఈ విషయం లో కృతి మేనేజర్‌ చాలా స్ట్రిక్ట్‌ గా వ్యవహరిస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

'రుద్ర' గా ప్రభాస్ కొత్త పోస్టర్ వైరల్!
కూలీ కోసం బుట్ట బొమ్మ... కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?

ప్లాప్‌ అయితే ఎలా పారితోషికం పెంచుతారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం బేబమ్మ క్రేజ్ కు ఇది ఇవ్వాల్సిందే అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు