ఇప్పుడు ఎక్కడ చూసిన గాని డిజిటల్ పద్దతిలోనే చెల్లింపులు చేస్తున్నారు.చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి దుకాణంలోను డిజిటల్ చెల్లింపు సౌకర్యం ఉంది.
అలాగే మన భారతదేశంలో డిజిటల్ చెల్లింపు విధానం బాగా ప్రజాదరణ పొందింది.డిజిటల్ చెల్లింపులో UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) కూడా అత్యంత ముఖ్యమైనది.
ఎందుకంటే మనీ లావాదేవీలు UPI మోడ్ లో మాత్రమే జరుగుతాయి.అప్పట్లో జేబులో డబ్బులు పెట్టుకునే వాళ్లు కానీ ఇప్పుడు ఫోన్ ఉంటే చాలు అన్నట్టు మారిపోయింది కాలం.
అయితే స్మార్ట్‌ఫోన్ నుండి చేసే ప్రతి UPI లావాదేవీల కోసం, ఏదైనా UPI యాప్, ఇంటర్నెట్ కలిగి ఉండటం అనేది చాలా అవసరం.అయితే ఇంటర్నెట్ లేకుండా కూడా మీరు UPI ద్వారా మీఫోన్ నుండి మీ డబ్బును వేరొకరికి పంపవచ్చనే విషయం మీకు తెలుసా.?
అది ఎలానో తెలుసుకోండి.ఇంకా చాలామందికి స్మార్ట్‌ఫోన్ ఉండదు.
అలా బేసిక్ ఫోన్ వాడే వారు కూడా ఇంటర్నెట్ సౌకర్యం లేకుండానే మీరు ఈ విధంగా ఎవరికైనా సులభంగా డబ్బు పంపవచ్చు.దీని కోసం, మీరు బ్యాంక్‌లో నమోదు చేసుకున్న మొబైల్ నంబర్ నుండి USSD కోడ్‌ను డయల్ చేయాలి.
అంటే బ్యాంక్ ఖాతాతో నమోదైన మొబైల్ నంబర్ నుండి *99# కు డయల్ చేయండి.ఆ తరువాత మీ ఫోన్ స్క్రీన్ పై ఒక మెసేజ్ కనిపిస్తుంది.
వచ్చిన మెసేజ్ ను జాగ్రత్తగా తనిఖీ చేయండి, దీనిలో మీరు ఖాతా బ్యాలెన్స్, ప్రొఫైల్ వివరాలు, లావాదేవీ స్థితిలో అభ్యర్థన, డబ్బు పంపడం , UPI పిన్ ని నిర్వహించడం వంటి ఎంపికను చూస్తారు.అప్పుడు మీరు ఎవరికైనా డబ్బు పంపాలనుకుంటే, డబ్బు పంపుపై క్లిక్ చేయండి.

మీరు ఎవరికి డబ్బు పంపాలనుకుంటున్నారో ఆ వ్యక్తి మొబైల్ నంబర్ ను నమోదు చేయండి.అయితే, మీరు అతని బ్యాంక్ ఖాతాతో నమోదు చేయబడిన అదే నంబర్ ను నమోదు చేయాలి.ఆ తరువాత ఆ వ్యక్తి పేరు మీకు కనిపిస్తుంది.మీరు ఆ పేరును కన్ఫర్మ్ చేసిన తర్వాత, మీరు పంపాలనుకుంటున్న మొత్తాన్ని నమోదు చేయండి.ఆ తరువాత ఒకే అని క్లిక్ చేసిన తర్వాత, మీకు రిమార్క్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.అప్పుడు మీ యొక్క UPI పిన్ అడుగుతుంది.
ఆ తరువాత మీ పిన్ ని నమోదు చేసిన తర్వాత మీ లావాదేవీ అనేది విజయవంతం అవుతుంది అన్నమాట.