Upasana : క్లియర్ గా కనిపిస్తున్న ఉపాసన బేబీ బంప్.. వైరల్ గా మారిన పిక్?

మెగా వారి కోడలు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) సతీమణి ఉపాసన( upasana ) గత ఏడాది గర్భం దాల్చిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఆమెకు ఏడవ నెల.

పెళ్లయ్యాక దాదాపు పది సంవత్సరాల తర్వాత రామ్ చరణ్ దంపతులు మెగా అభిమానులకు తీపి కబురు అందించారు.ఇక అప్పటినుంచి మెగా అభిమానులు ఉపాసనకు సోషల్ మీడియా ద్వారా జాగ్రత్తలు చెబుతూ వస్తున్నారు.

ఇక ఉపాసన కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బాగా పోస్టులు షేర్ చేస్తూ ఉంటుంది.అలా ఆమె ఏ పోస్ట్ షేర్ చేసిన కూడా వెంటనే మెగా అభిమానులు కచ్చితంగా రెస్పాండ్ అవుతూ ఉంటారు.

అయితే ఈమె గర్భం దాల్చిన విషయాన్ని మెగా ఫ్యామిలీ( Mega Family ) సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నప్పుడు కొంతమంది బాగా అనుమానం పడ్డారు.ఇక ఆమె ప్రెగ్నెన్సీ అని చెప్పినప్పటి నుంచి ఆర్ఆర్ఆర్ సినిమా అవార్డుల భాగంలో బాగా తిరగటం, అంతేకాకుండా ఆమె బేబీ బంప్( Baby bump ) కూడా కనిపించకపోవడంతో సరోగసి ద్వారా బేబీని కంటున్నారేమో అని చాలామంది ఘోరంగా కామెంట్లు కూడా పెట్టారు.

Advertisement

కానీ ఆ తర్వాత ఆమెకు జరిగిన సీమంతం వేడుకలు, కాస్త కనిపించి కనిపించని బేబీ బంప్ తో కనిపించడంతో ప్రతి ఒక్కరు ఆమెనే గర్భం దాల్చింది అని నమ్మారు.

అలా మొత్తానికి సరోగసి అనే మాటను తన బేబీ బంప్ తో కొట్టి పారేసింది ఉపాసన.ఇక ఉపాసన ప్రెగ్నెన్సీ( Upasana Pregnancy ) అయినప్పటికీ కూడా తన భర్తతో బాగా ట్రిప్స్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఇంత ఆలస్యంగా ఆమె గర్భం దాల్చినందుకు రెస్ట్ తీసుకోకుండా ఇలా ప్రయాణాలు చేయడం అవసరమా అంటూ కూడా కొందరు కామెంట్లు పెట్టారు.

కానీ ఉపాసన న్యాచురల్ గా బిడ్డను కనాలన్న ఉద్దేశంతో అలా ప్రయాణాలు చేస్తుందని తెలిసింది.అంతేకాకుండా తన ఫ్రెండ్స్ తో కలిసి దిగిన ఫోటోలను, సీమంతం ఫోటోలను కూడా పంచుకుంది.ఇప్పటివరకు ఆమె సీమంతం సాంప్రదాయ బద్ధంగా జరిగినట్లు అసలు అనిపించలేదు.

రీసెంట్ గా తన ఫ్రెండ్స్ కూడా సీమంతం చేయగా అది కూడా వేరే కల్చర్ లో చేసుకుంది.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

మొత్తానికి ఉపాసన తను ఎలా అయితే ఆనందపడాలో అలాగే ఆనందపడుతుందని చెప్పాలి.అయితే ఇదంతా పక్కనే పెడితే తాజాగా ఒక స్టోరీ పంచుకుంది ఉపాసన.అందులో తన ఫ్రెండ్స్ తో పాటు తను కూడా ఉండగా.

Advertisement

ఈసారి తన బేబీ బంప్ క్లియర్ గా కనిపించింది.ఇక మొదటిసారి తన బేబీ బంప్ అలా కనిపించడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

ఇక ఆ ఫోటో చూసి జూనియర్ రామ్ చరణ్ కోసం ఇంకెన్ని రోజులు ఆగాలి అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.ఇక మరి కొంతమంది ఆమెకు మరింత జాగ్రత్తలు చెబుతూ కనిపిస్తున్నారు.

ప్రస్తుతం ఆ ఫోటో బాగా వైరల్ అవుతుంది.

తాజా వార్తలు