పేరుకేమో ఆంధ్ర దేవానంద్ కానీ ఎందుకు కనబడకుండా పోయాడు ?

బాలీవుడ్ లో దేవానంద్ అంటే చాలా క్రేజ్ ఉంటుంది.బాలీవుడ్ తో పాటు యావత్ దేశం కూడా దేవానంద్ పట్ల చాలా ఆకర్షితులయ్యేవారు.

 Untold Side Of Tollywood Veteran Hero Ram Mohan Rao Details, Tollywood Veteran A-TeluguStop.com

అయితే తెలుగులో వచ్చిన ఒక హీరో ఆంధ్ర దేవానంద్ గా పేరు గడించాడు.మరెవరో కాదు రామ్మోహన్ రావ్.

తేనె మనసులు కన్నమనసులు సినిమాతో మొదలుపెట్టిన ఈ నటుడు ఆంధ్ర దేవానంద్ గా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం.తొలి సినిమాలు బాగా విజయవంతం సాధించడంతో పెద్ద హీరో అవుతాడు అనుకున్నా రామ్మోహన్ రావు కేవలం 13 సినిమాలతోనే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయాడు.

మరి అతడు ఏమయ్యాడు చివరికి ఎలా రామ్మోహన్ రావు కథ ముగిసింది అనే విషయం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.ఫిబ్రవరి 4, 1939లో ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు లో పుట్టాడు రామ్మోహన్ రావు.

అతడి తండ్రి వారణాసి రామారావు కి పుట్టిన 8 మందిలో రామ్మోహన్ రావు ఒకడు.అయితే రామ్మోహన్రావు చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేవాడు.కర్నూల్ లో డిగ్రీ పూర్తి చేశాడు.ఆ తర్వాత హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనే కంపెనీలో బెంగళూరులో ఇంజనీరింగ్ మేనేజర్ గా ఉద్యోగం కూడా చేశాడు.

Telugu Ram Mohan, Ram Mohan Rao, Kanne Manasulu, Tenemanasulu, Tollywood-Movie

అతడు ఈ ఉద్యోగంలో కొనసాగి ఉంటే ఈరోజు ఒక పెద్ద వ్యాపారవేత్తగా లేదంటే బాగా సెటిల్ అయినా ఒక ఉద్యోగస్తుడిగా ఆయన ఉండేవాడు.అన్ని వదులుకొని ఈ సినిమా ఇండస్ట్రీకి రావడంతో అతడికి సర్వం పోయింది అని చెప్పాలి.సినిమా అంటే ఇష్టం కలగడంతో అటుగా ప్రయత్నాలు కొనసాగించాడు మొదటగా ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో తేనె మనసులు అనే సినిమాలో నటించాడు ఆ తర్వాత రంగులరాట్నం కన్నె మనసులు అంటే హిట్టు సినిమాల్లో నటించాడు.

Telugu Ram Mohan, Ram Mohan Rao, Kanne Manasulu, Tenemanasulu, Tollywood-Movie

ఈ సినిమాల్లో రామ్మోహన్ రావు ని చూసిన వారంతా కూడా ఆంధ్ర దేవానంద్ అంటూ ఆకాశానికి ఎత్తేసేవారు.దాంతో అతడు నిజంగానే దేవానంద్ అనే ఫీల్ లో ఉండేవాడు అలాగే అతడు హీరో రోల్ తప్ప మరో రూల్స్ చేయడానికి ఇష్టపడేవాడు కాదు.దాంతో ఆ తర్వాత వచ్చిన రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అవడంతో అడ్రస్ లేకుండా పోయాడు.

ఆ తర్వాత హైదరాబాద్ కి కూడా మకాం మార్చిన ఏమి ఉపయోగం లేదు.చివరగా రామ్మోహన్ రావు ఆర్థికంగా పూర్తిగా చితికిపోయాడు చివరినాల్లలో బ్రతకడానికి ట్యూషన్లు కూడా చెప్పుకున్నాడు.

అలా 2005 లో కన్నుమూశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube