సాధారణంగా ఏదైనా సినిమా ఘనవిజయం సాధిస్తే అదే సినిమాతో ఆయా సినిమా నటీనటులకు పేరు పెట్టి పిలవడం మన ఇండస్ట్రీలో బాగా అలవాటు.అలా 60 దశకం లో టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై ఒక వెలుగు వెలిగిన నాయక సుజాత.
ఆమెకు భీష్మ చిత్రం ద్వారా మంచి గుర్తింపు లభించింది.అందుకే ఆమెను భీష్మ సుజాత అంటూ పిలుస్తారు.
కేవలం తెలుగులోనే కాదు కన్నడ, తమిళ పరిశ్రమల్లో ఆమె చాలా సినిమాల్లో నటించారు.సుజాత పుట్టింది, పెరిగింది తెనాలిలో.
సినిమాలు అంటే ఇష్టం ఉండడంతో మొదట్లో ఎస్వి రంగారావు, రామకృష్ణ, జమున, శారదా వంటి నటీనటులతో నాటకాల్లో నటించేది.
ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించి పలు సినిమాల్లో మంచి నాయకగా గుర్తింపు సంపాదించుకుంది.
ఆ సమయంలోనే పిఠాపురం జమీందారు ఆమెను చూసి ప్రేమలో పడ్డారు.అందుకే ఆమె మొదటి భార్యను, పిల్లలని ఒప్పించి మరి భీష్మ సుజాతను రెండవ పెళ్లి చేసుకున్నాడు.
అప్పటికే ఆగర్భ శ్రీమంతులు కాబట్టి సుజాత కూడా అతడితో పెళ్లికి ఒప్పుకుంది.అలాగే పెళ్లికి ముందే ఎలాంటి అభ్యంతరాలు రాకూడదని అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు.
ఇలా ఒక హీరోయిన్ పిఠాపురం జమీందారు రాజు గా పెళ్లి చేసుకోవడం అప్పట్లో సంచలనమైన వార్త.
ఎక్కడ చూసినా వీరు పెళ్లి గురించిన వార్త అప్పట్లోనే బాగా గొప్పగా వైరల్ అయింది.కానీ వీరు పెళ్లి తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది.మొదట్లో సినిమాల్లో నటించవచ్చు అని ఒప్పుకున్నా రాజు గారి కుటుంబం ఆ తర్వాత సినిమాలు వద్దు అని చెప్పింది.
ఇక రాజుగారికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా కోర్టులో ఉండడంతో వారికి ఆర్థికంగా కాస్త ఇబ్బందులు ఎదురయ్యాయి.ఆ తర్వాత ఉన్నది కాస్త దానధర్మాలకు పూర్తిగా పోగొట్టేశారు రాజుగారు.
దాంతో కుటుంబ బాధ్యత అంతా కూడా సుజాత పై పడింది.ఆమె నటిస్తూ ఆ కుటుంబాన్ని మొత్తం పోషించింది.నేటికీ కూడా ఆ పిఠాపురం రాజు గారి ఆస్తులు కోర్టులో నడుస్తూనే ఉన్నాయి.అయితే పెళ్లి కారణంగా ఆమె స్టార్ హీరోయిన్ కాలేకపోయానని బాధ మాత్రం ఆమెలో అలాగే ఉండిపోయిందట.
ఒక వేళ పెళ్లి చేసుకోకుండా ఉండి ఉంటే తాను ఒక జమున, ఒక వాణిశ్రీ లాగా స్టార్ హీరోయిన్ అయ్యేదాన్నేమో అంటూ అమే ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు.