పరమవీరచక్ర, అశోక చక్ర వంటి అవార్డులను సృష్టించిన ఆ మహిళ ఎవరో తెలుసా?

సైనికులకు, నావి అధికారులకు, యుద్ధంలో మరణించిన సైనికులకు, దేశానికి సేవ చేస్తున్న వివిధ రంగాల అధికారులకు ఇచ్చే అవార్డుల గురించి చాలా తక్కువ మందికి తెలుసు.

వాటిలో పరమవీరచక్ర, అశోక చక్ర, కీర్తి చక్ర, మహా వీర చక్ర, శౌర్య చక్ర వంటి ఈ పేర్లన్నీ మీరు వినే ఉంటారు.

ఈ అవార్డులన్నీ ఆయా వ్యక్తులు వారి చూపించిన ధైర్య సాహసాలకు తెగువకి చిహ్నంగా ఇస్తూ ఉంటారు.వారి వారి క్యాడర్ నీ, ర్యాంక్ ను బట్టి వారికి ఏ అవార్డు ఇవ్వాలనేది నిర్ణయింస్తు ఇస్తూ ఉంటారు.

ఇక్కడ వరకు మాకందరికీ తెలిసిన విషయమే కదా ఇందులో కొత్త వింత ఏముంది అని అనుకుంటున్నారు కదా ? అసలు విషయంలోకి వస్తున్నాను.ఈ అవార్డులన్నీ కూడా డిజైన్ చేయడానికి ప్రభుత్వం పూనుకున్న సమయంలో వీటికి రూపకల్పన చేసింది ఒక విదేశీ వనిత అన్న విషయం మీకు తెలుసా? మీరు వింటున్నది నిజమే ఈ అవార్డులన్నీ కూడా రూపకల్పన చేసింది డిజైన్ చేసింది ఒక విదేశీ వనిత.ఆమె పేరు Eve Yvonne Maday de maros.

ఈవ్ మారోస్ 1932 లో మరాఠీ మిలట్రీ అధికారి అయిన విక్రమ్ లక్నోవర్ నీ ప్రేమించి పెళ్లాడి ఇండియాకు వచ్చేసింది.వచ్చాక సావిత్రి అని పేరు మార్చుకుంది.

Advertisement

మరాఠీ, సంస్కృతం, హిందీ భాషలను అవపోసన పట్టింది.పూర్తి హిందువుగా మారిపోతుంది.

చరిత్ర ను, గ్రంథాలను అధ్యయనం చేసింది.

స్వతహాగా డిజైనర్ పెయింటర్. ఆ తర్వాత భరత నాట్యం, చిత్ర లేఖనం, సంగీతం కూడా నేర్చుకుంది.యుద్ధంలో దైవ సాహసాలు కనబరిచిన సైనికులకు అవార్డులు ఇవ్వాలని భారత ఆర్మీ జనరల్ మేజర్ భావించినప్పుడు ఆయనకు సావిత్రి గుర్తుకొచ్చింది ఆ బాధ్యతను సావిత్రికి అప్పగించడంతో ఆమె ఆ పనిలో నిమగ్నమైంది.

దాంతో సావిత్రి పరమవీరచక్ర అని అవార్డుకు పురుడు పోసింది.దధీచి మహర్షి ధన దేహాన్ని త్యాగం చేసి వజ్రాయుధంగా మార్చిన చరిత్ర గుర్తుకొచ్చి కంచుతో అవార్డ్ తయారు చేసి, మధ్యలో అశోకుడి సింహం చిహ్నం, నలువైపులా వజ్రాయుధం చెక్కి ఆర్మీ చూపించగా అందరూ శభాష్ అంటూ ఓకే చెప్పారు.

వైయస్సార్ బీమా పథకం పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం..!!
ఈ కూర‌గాయ‌ల పిండి తింటే.. ఎన్ని హెల్త్ బెనిఫిట్సో తెలుసా?

ఆ తర్వాత మిగతా అన్ని అవార్డ్స్ కూడా ఆమెనే రూపకల్పన చేయడం జరిగింది అలా వేరే దేశంలో పుట్టిన భారతీయ ఆత్మని తన ఆత్మగా మార్చుకుని సావిత్రి లక్నోవర్..

Advertisement

తాజా వార్తలు