క్యూట్ బ్యూటీ అనుపమ కెరీర్ ఎందుకు ఫెయిల్యూర్ గా నిలుస్తోంది.? 

అనుపమ పరమేశ్వరన్.క్యూట్ బ్యూటీ.

రింగులు జుట్టు, చక్కటి సౌందర్యం.అద్భుతమైన నటన.అన్నీ బాగున్నా.ఈ అమ్మడికి అస్సలు కలిసి రావడం లేదు.

ఓ వైపు పలువురు మలయాళం భామలు సినిమా పరిశ్రమను ఏలుతున్నా.ఈ అమ్మడు మాత్రం అనుకున్న స్థాయిలో ముందుకు సాగడం లేదు.

వరుసగా ఎదరువుతున్న ఫ్లాపులతో తల పట్టుకుంటుంది.అయితే ఈ అపజయాలకు తను తీసుకునే నిర్ణయాలే కారణం అనే మాటలు వినిపిస్తున్నాయి.

Advertisement

ప్రేమమ్ సినిమాతో తొలిసారి సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ.ఆ తర్వాత దిల్ రాజు నిర్మించిన శతమానంభవతి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.2017లో వచ్చిన ఈ సినిమా.మంచి విజయాన్ని అందుకుంది.

ఈ సినిమా తర్వాత అనుపమ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.పలు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.

అన్నింటికి ఓకే చెప్పింది.అటు తమిళంలో కూడా పలు సినిమాలు చేసింది.

అటు మలయాళంలోనూ పలు సినిమాలు చేసింది.అటు దుల్కర్ సల్మాన్ తో కలిసి తెలుగులో అందమైన జీవితం అనే సినిమా కూడా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

ఈ సినిమా పేరును కూడా రిలీజ్ చేశారు.అటు రామ్ తో కలిసి రెండు సినిమాలు చేసినా.

Advertisement

అంతగా జనాలను అలరించలేదు.

అయితే అనుపమ ఎందుకు సక్సెస్ కాలేదు అని చెప్పడానికి పలు రీజన్స్ చెప్తారు సినీ జనాలు.ఈ ఎప్పుడు ఒకే రకమైన క్యారెక్టర్లు చేస్తుంది.అంతేకాదు.

ఫ్యామిలీ టైప్ సినిమాలకు మాత్రమే సరే అంటుంది.అందుకే స్టార్ హీరోయిన్ల సరసన చేరేందుకు అవకాశం రాలేదు.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రెండు మూడు సినిమాలు చేస్తుంది.నిఖిల్ తో కలిసి ఓ ప్రాజెక్టులో నటిస్తుంది.

అయితే ఈమె ఎంచుకునే కథలు సరిగా లేకనే ఫెయిల్యూర్ అవుతున్నట్లు టాక్ నడుస్తుంది.ఇప్పటికైనా అనుపమ అన్ని రకాల సినిమాలు చేయాలని.

అప్పుడే సక్సెస్ అవుతుందని సినీ జనాలు అభిప్రాయపడుతున్నారు.

తాజా వార్తలు