Nirmala Sitharaman Kantara movie: కాంతార సినిమాను వీక్షించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్?

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి కేజిఎఫ్ వంటి అద్భుతమైన సినిమా వచ్చిన అనంతరం ఈ సినిమా రికార్డులను బద్దుల కొడుతూ హీరో రీషబ్ శెట్టి ఆయన స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కిన కాంతార సినిమా సరికొత్త రికార్డులను సృష్టించిందని చెప్పాలి.

కాంతార సినిమా ద్వారా రిషబ్ శెట్టి దేశవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు రాజకీయ నాయకుల చేత ప్రశంసలు అందుకుంటున్నారు.

ఇప్పటికే ఈ సినిమా చూసినటువంటి ఎంతోమంది సినీ ప్రేమికులు రిషబ్ శెట్టి పట్ల ప్రశంసలు కురిపించారు.తాజాగా ఈ చిత్రాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వీక్షించారు.

ఈ సందర్భంగా ఈమె కాంతార సినిమాని చూడటంతో ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ హీరో రిషబ్ శెట్టి పై ప్రశంసలు కురిపించారు.ఈ సందర్భంగా నిర్మల సీతారామన్ బెంగళూరులో థియేటర్లో ఈ సినిమాని వీక్షించారు.

ఈ క్రమంలోనే థియేటర్లో దిగిన ఫోటోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు.వాలంటీర్లు శ్రేయోభిలాషుల బృందంతో కలిసి ఈ సినిమా చూడటం జరిగింది అంటూ ఈమె ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.

Union Minister Nirmala Sitharaman Watched Kantara Movie Details, Union Minister
Advertisement
Union Minister Nirmala Sitharaman Watched Kantara Movie Details, Union Minister

కాంతార సినిమా తులువనాడు, కరావళి ప్రాంతంలోని సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచింది అంటూ ఈమె థియేటర్లో దిగినటువంటి ఫోటోని షేర్ చేస్తూ సినిమాపై ప్రశంసలు కురిపించారు.ప్రస్తుతం నిర్మల సీతారామన్ చేసినటువంటి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇలా ఇప్పటికే ఈ సినిమాపై ఎంతోమంది ప్రముఖులు పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురిపించడంతో రిషబ్ శెట్టి సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈయన పేరు కూడా పాన్ ఇండియా స్థాయిలో మారుమోగడమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా ఎంతోమంది ఆదరాభిమానాలను సొంతం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు