మోటోరోలా నుంచి మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 5G స్మార్ట్ ఫోన్( Motorola Edge 50 Pro 5G smartphon ) లాంచ్ అయ్యింది.మోటోరోలా స్మార్ట్ ఫోన్ ను మోటోరోలా అధికారిక వెబ్ సైట్, ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.ఈ ఫోన్ కు సంబంధించిన స్పెసిఫికేషన్ వివరాలతో పాటు ధరపై ఉండే ఊహించని డిస్కౌంట్ ఆఫర్ల గురించి తెలుసుకుందాం.
మోటోరోలా ఎడ్జ్ 50ప్రో 5G స్మార్ట్ ఫోన్:
ఈ ఫోన్ 6.7 అంగుళాల కర్వడ్ pOLED డిస్ ప్లే,1.5k రిజల్యూషన్, 2000 నిట్స్ గరిష్ట బ్రైట్ నెస్, 144Hz రిఫ్రెష్ రేట్, DC డిమ్మింగ్ సపోర్ట్ కలిగి ఉంది.4500mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి 50W వైర్ లెస్ ఛార్జింగ్,125W ఫాస్ట్ చార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.
ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 SoC చిప్ సెట్, ఆండ్రాయిడ్ 14 ఆధారిత హలో UI OS పై పనిచేస్తుంది.ప్రపంచంలోనే తొలిసారిగా pantone తో కూడిన AI ఆధారిత ప్రో గ్రేడ్ కెమెరాలను కలిగి ఉన్న స్మార్ట్ ఫోన్ ఇదే.50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 13 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 3X జూమింగ్ సామర్థ్యంతో 10 ఎంపీ టెలిఫోటో లెన్స్ లను కలిగి ఉంది.ఈ ఫోన్ ఇన్ డిస్ ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్,IP 68 రేటింగ్ తో డస్ట్, వాటర్ రేసిస్టెన్స్ తో పాటు ఉంటుంది.
ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే.8GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.31999 గా ఉంది.12GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.35999 గా ఉంది.ఈ ఫోన్ Luxe లావెండర్, మూన్ లైట్ పెర్ల్, బ్లాక్ బ్యూటీ రంగుల్లో లభిస్తుంది.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ పై ఉండే లాంచింగ్ డిస్కౌంట్ ఆఫర్ల విషయానికి వస్తే.8GB RAM వేరియంట్ కొనుగోలు చేస్తే 68W ఛార్జర్, 12GB RAM వేరియంట్ కొనుగోలు చేస్తే 125W చార్జర్ పొందవచ్చు.అంతేకాదు లాంచింగ్ ఆఫర్ కింద ఈ రెండు వేల ధరపై రూ.2000 తగ్గింపు ఉంది.HDFC క్రెడిట్ కార్డు ద్వారా ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపు పొందవచ్చు.HDFC డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా EMI లావాదేవీలు నిర్వహిస్తే రూ.2250 వరకు తగ్గింపు పొందవచ్చు.అంటే బేస్ వేరియంట్ ను రూ.27999 కే కొనుగోలు చేయవచ్చు.